Jammu Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరిగింది. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్‌లోని 50కి పైగా స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు.
Delhi: వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే, తాజాగా ఆ పార్టీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్‌కి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ఈ రోజు బీజేపీలో చేరారు. బీజేపీ అగ్ర నేతలు రాంవీర్ సింగ్ బిధూరి, అరవిందర్ సింగ్ లవ్లీ, యోగేంద్ర చందోలియా సమక్షంలో వారంతా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ బోర్డును విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని, దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. వక్ఫ్‌కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతుందని, వక్ఫ్‌ను ఖతం చేయాలని అనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు లేకుండా బీజేపీ చేయాలనుకుంటుందని అసదుద్దీన్ మండిపడ్డారు. ఈరోజు దారుస్సలాంలో ఎంపీ…
మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన రాజ్యాంగ గౌరవ సదస్సులో ఆయన ప్రసంగించారు.
హర్యానాలో అక్టోబర్ 1న జరగాల్సిన పోలింగ్ ను నిలిపేయాలని భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల కమిషన్‌ను అభ్యర్థించింది. సుదీర్ఘ వారంతపు సెలవుల( లాంగ్ వీకెండ్) కారణంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సోము వీర్రాజు.. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అంచనాలు వేయడం కష్టం అన్నారు.. విశాఖపట్నం రాజధాని పేరు చెప్పి 500 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకున్నాడు.. తప్ప రాజధానికి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
తెలంగాణ బీజేపీ నేల విడిచి సాము చేయాలనుకుంటోందా? ఆ పార్టీ ముఖ్యులు వాస్తవాలకు దూరంగా ఆలోచిస్తున్నారా? సభ్యత్వ నమోదు విషయంలోనే వాళ్ళ ఆలోచనలోని డొల్లతనం తేలిపోతోందా? అలవికాని లక్ష్యాన్ని పెట్టుకుంటున్నారన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి? రాష్ట్రంలో కమలం పార్టీ వాస్తవ సామర్ధ్యం ఎంత? వాళ్ళు పెట్టుకున్న మెంబర్షిప్ టార్గెట్ ఎంత? బీజేపీలో సభ్యత్వ హడావుడి మొదలైంది. ఈసారి తెలంగాణలో భారీ ఎత్తున కొత్త సభ్యత్వాలను ఇప్పించాలని టార్గెట్ పెట్టుకుందట పార్టీ. అదీ కూడా అలా ఇలా కాదు……
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, జేకే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.
Komatireddy Venkat Reddy: తెలంగాణలో టీఆర్ఎస్ లేదు.. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడి ఆఫీస్ ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని.. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అంశంలో ప్రస్తుతం అధికార-ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందించారు.