ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పోతే డ్రోన్లు ఎగురవేశారని కేసులు పెట్టారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పుడెందుకు కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఆయన మరి ఆ రోజే ఫామ్ హౌస్ నాది కాదని కేటీఆర్ చెబితే అయిపోవు కదా?.. కానీ ఇప్పుడు ఇతరుల పేరుపై మార్చి నాది కాదు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
కేటీఆర్.. జన్వాడ ఫాం హౌస్ నాది కాదంటారు..? మిత్రున్ని కోర్టుకు పంపించారు.. అక్రమ నిర్మాణం కూల్చాలి అంటారు.. ఇంకో పక్క కోర్టులో స్టేకి వెళ్ళారని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ పక్కన ఉండే చిల్లర మనుషులు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరికి ఉన్నా.. హైడ్రా తన పని తాను చేస్తుందన్నారు.
ఇంతకి ఇది హైడ్రా నా హై డ్రామానా తెలియడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏమీ చేసిందని ప్రశ్నించారు. అప్పుడు అధికారులు అనుమతులు యే ప్రాతిపదికన ఇచ్చారని నిలదీశారు.
సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లలో ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆరేడు వేల ఓట్లు మైనస్ అయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ చెబుతుంటే నవ్వొస్తోందన్నారు. కేటీఆర్ జన్వాడలో ఫామ్ హౌజ్ కట్టుకున్నారని.. నేను కేటీఆర్ ఫామ్ హౌజ్ చూసి వచ్చానన్నారు.
Kishan Reddy: నేటి (బుధవారం) నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Eknath Shinde: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇదిలా ఉంటే, సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గతంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్‌ని అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. బీజేపీని అణగదొక్కేందుకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంవీఏ కూటమిలో చేరడానికి చేసిన ప్లాన్ అని షిండే అన్నారు.
Assembly Elections: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలు జరిగి,
బీజేపీ మమతా బెనర్జీని ‘‘నిర్మమతా బెనర్జీ’’గా పేర్కొంది. ఈ భయంకరమైన సంఘటన తర్వాత ఆమె పేరు మార్చాలని దుయ్యబట్టింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ‘విధ్వంసకురాలి’’గా మారారని అన్నారు. ఆమె తన దుశ్చర్యలతో సమాజానికి సేవ చేస్తున్న ఒక మహిళా డాక్టర్ గౌరవాన్ని నాశనం చేశారని అన్నారు.
Rahul Gandhi: లాటరల్ ఎంట్రీ వివాదంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఆ విధానంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి అని సోమవారం అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ విధానాన్ని తీసుకువచ్చిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ రామరాజ్యాన్ని వక్రీకరించి, రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి, బహుజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీగా ఎన్నికైన తర్వాత కంగనా రనౌత్ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారింది. ఆమె తదుపరి చిత్రం 'ఎమర్జెన్సీ'లో కనిపించనుంది. ఇది సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది.