Sushilkumar Shinde: మాజీ కేంద్ర హోం మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ హాయాంలో 2012లో షిండే కేంద్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో తన శ్రీనగర్ పర్యటనను గుర్తు చేసుకున్నారు. మంగళవారం, ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌ని సందర్శించినప్పుడు తానను భయపడ్డానని వెల్లడించారు. ‘‘ఫైవ్ డికేడ్స్ ఇన్ పాలిటిక్స్’’ అనే తన జ్ఞాపకాల ఆవిష్కరణ సందర్భంగా, షిండే 2012లో లోయను సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
Read Also: Indian Air Force: ఎయిర్‌ఫోర్స్ మహిళా అధికారిపై వింగ్ కమాండర్ అత్యాచారం.. ఓరల్ సె*క్స్‌కి బలవంతం..
‘‘నేను హోంమంత్రి కాకముందు విద్యావేత్త విజయ్ ధర్‌ని సలహా అడిగానున. అతను నన్ను లాల్ చౌక్ సందర్శించడండి. ప్రజలను కలవండి, దాల్ సరస్సు చుట్టూ తిరగండి’’ అని సలహా ఇచ్చాడు. ఆ సలహా నాకు ప్రచారాన్ని ఇచ్చిందని, ఇక్కడ ఎలాంటి భయం లేకుండా వెళ్లే హోంమంత్రిగా ప్రజలు భావించారని ఆయన షిండే అన్నారు. 2012లో పి చిదంబరం తర్వాత షిండే హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కలిసి శ్రీనగర్‌లోని క్లాక్ టవర్‌ని సందర్శించారు. దీనిని ‘ఘంటా ఘర్’ అని కూడా పిలుస్తారు. మాజీ సీఎం షేక్ అబ్దుల్లా అభ్యర్థన మేరకు 1978లో దీనిని నిర్మించారు. 2008, 2010 కాశ్మీర్ లోయ అల్లర్లలో ఈ లాల్ చౌక్‌పై పాకిస్తాన్ జెండాని ఎగరేశారు.
షిండే వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎక్స్ వేదికగా ‘‘ యూపీఏ కాలంలో నాటి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, జమ్మూ కాశ్మీర్ వెళ్లేందుకు భయపడుతున్నట్లు ఒప్పుకున్నాడు.’’ ఈ రోజు రాహుల్ గాంధీ కాశ్మీర్‌లో భారత్ జోడో యాత్రలో మంచు పోరాటం చేస్తూ హాయిగా కనిపించారు. కానీ ఎన్సీ, కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్‌ని మరోసారి టెర్రర్ రోజులకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాయని పునావాలా విమర్శించారు.