Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండిసంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.. హిందువుల పండుగులకే ఆంక్షలు, బంధనలు ఎందుకు అని ప్రశ్నించారు. సెప్టెంబరు 17వ తేదీన నరేంద్ర మోడి పుట్టినరోజు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలలో జరుపుకోవాలన్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం.. తెలంగాణకి స్వాతంత్ర్యం వచ్చినరోజు అన్నారు. రజాకార్ల అరచకాలని మనం ఎప్పుడూ మరిచిపోలేం.. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపడం లేదని విమర్శించారు. ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భయపడి సెప్టెంబర్ 17ని జరపడం లేదన్నారు. వీరుల బలిదానాలని, త్యాగాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ మరిచిపోతున్నాయని బండి సంజయ్ అన్నారు.
Read Also: Drug Seize : ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో రూ.25కోట్లు విలువ చేసే డ్రగ్స్ సీజ్
ఇక, అసదుద్దీన్ ఓవైసీపీ పేదల గొంతుక ఎలా అవుతాడని రేవంత్ రెడ్డిని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఎవరికి సేవ చేసాడు, ఓవైసీ కాలేజీని హైడ్రా ఎప్పుడు కూల్చుతుంది అని అడిగారు. ఎవరూ అధికారంలో ఉంటే వారి సంకలోకి వచ్చి కొమ్ముకాసే పార్టీ ఎంఐఎం.. మేమంతా సర్దార్ పటేల్ వారసులం.. మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆగష్టు 15 లాగా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ఆయన అన్నారు. మొన్నటిదాక హైడ్రా లొల్లి, ఇప్పుడు విగ్రహాల లొల్లి.. ఆరు గ్యారంటీల అమలు నుంచి దృష్టి మరల్చడానికే ఈ విగ్రహాల లొల్లి అని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు బీఆర్ఎస్ చేతిలో ఉంది.. ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ చేతిలో ఉంది.. అందుకే లోపాయకారి ఒప్పిందం చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పరిపాలన దినోత్సవం అంటే ఒప్పుకోం.. తెలంగాణ విమోచన దినోత్సవం అనడానికి కాంగ్రెస్ కి భయమెందుకు అని బండి సంజయ్ మండిపడ్డారు.