Ravneet Singh Bittu: రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలో సిక్కులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీతో పాటు సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోనియా గాంధీ ఇంటి వెలుపల సిక్కులు ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉంటే, సిక్కులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ‘‘దేశంలో నంబర్-1 టెర్రలిస్ట్’’ అని అభివర్ణించాడు. రాహుల్ గాంధీ భారతీయుడు కాదని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశానికి అతిపెద్ద శత్రువుగా పేర్కొన్నారు.
గతంలో ఆయన ముస్లింలను ఉపయోగించుకోవాలని ప్రయత్నిచాడు, కానీ అది జరగలేదని, ఇప్పుడు సిక్కుల్ని విభజించాలని ప్రయత్నిస్తున్నాడని రవ్‌నీత్ సింగ్ బిట్టూ మండిపడ్డారు. ఇండియా మోస్ట్ వాంటెడ్ వ్యక్తులు కూడా రాహుల్ గాంధీ మాట్లాడినట్లే మాట్లాడారని చెప్పారు. తీవ్రవాదులు కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని మెచ్చుకుంటున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతున్నారంటే, దేశంలో నంబర్ వర్ టెర్రరిస్ట్ ఆయనే అని అన్నారు. సిక్కుల గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మద్దతు తెలిపిన విషయాన్ని బిట్టూ ప్రస్తావించారు. దేశానికి అతిపెద్ద శత్రువు ఎవరినైనా పట్టుకుంటే ప్రతిఫలం ఉంటుందని అని అనుకుంటే అది రాహుల్ గాంధీ అని నా అభిప్రాయం.
Read Also: West Bengal: పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నేతని కాల్చి చంపిన దుండగులు..
అంతకుముందు, అమెరికా వర్జీనియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ సిక్కుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా.. లేదా..? అనే దానిపై భారత్‌లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కడాను ధరించి, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా..? ఇది సిక్కులకు మాత్రమే కాదు. అన్ని మతాలకు సంబంధించింది’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
‘‘రాహుల్ గాంధీ భారతీయుడు కాదని, అతనను ఎక్కువ సమయం ప్రపంచం బయటే గడిపాడు. అతని స్నేహితులు కుటుంబం అక్కడే ఉన్నారు. దీంతో అతడు ఎక్కడికి వెళ్లినా దేశాన్ని గౌరవించడు, ప్రేమించడు. విదేవాల్లో ఉండీ భారత్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటాడు’’ అని అన్నారు. ‘‘అతను ఓబీసీల గురించి కులాల గురించి మాట్లాడుతాడు. ఇతను చెప్పులు కుట్టేవారి, వడ్రంగి, మెకానిక్ బాధలను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పటికీ వారి బాధల్ని అడుగుతున్నాడు. ఫోటోల కోసం ఇదంతా చేస్తున్నాడు’’ అని బిట్టూ అన్నారు.