Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపి అవమానిస్తు్న్నారడని అమిత్ షా మండిపడ్డారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయడాన్ని బీజేపీ ఎప్పటికీ అంగీకరించడని షా అన్నారు.
Hemant Soren : జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) పై తీవ్ర దాడిని ప్రారంభించారు.
59 మందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతూ.. రెండో జాబితా విడుదల చేసింది కూటమి ప్రభుత్వం.. 59 మందితో విడుదల చేసిన జాబితాలో జనసేన నుంచి 9 మందికి.. బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కగా.. మిగతా పోస్టులు తెలుగుదేశం పార్టీకి చెందినవారికి దక్కాయి..
PM Modi : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోడీ రెండోసారి నవంబర్ 10న వారంలోపే వస్తున్నారు. ఇక్కడ రాజధాని రాంచీలో బీజేపీ అభ్యర్థితో కలిసి రోడ్ షో చేయనున్నారు.
హిమాచల్ప్రదేశ్ రాజకీయాలను సమోసా వివాదం కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ వ్యవహారం రచ్చరచ్చ చేస్తోంది. ఇప్పటికే నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సమోసాల మిస్సింగ్పై అధికార కాంగ్రెస్ పార్టీ సీఐడీ విచారణకు ఆదేశించడం పెను దుమారం చెలరేగింది
Uddhav Thackeray: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే, నాశనం అవుతాం) వ్యాఖ్యలపై ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అభ్యంతరం చెప్పారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ ఈ వ్యాఖ్యల్ని తిరస్కరించడంపై ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి విమర్శలు ఎక్కుపెడుతోంది.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహా వికాస్ అఘాడీ కూటమిపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. డ్రైవర్ సీటు కోసం మహా వికాస్ అఘాడీ నేతలు కొట్టుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలేలో నిర్వహించిన ప్రచార సభలో మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
DK Shivakumar: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజాదరణకు భయపడి ఆయనపై బీజేపీ నిందలు వేస్తోందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. సిద్ధరామయ్య పవర్ఫుల్ మాస్ లీడర్, ఆయనతో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన బలమైన ప్రజానాయకులందర్ని అంతమొందించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగళూర్లో శుక్రవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సాగిన పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి.. భీమలింగంకు పూజలు చేశారు. రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.
కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని పిచ్చోళ్లుగా ముద్రవేసి వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం హిందూ దేవాలయాలు, హిందువులపై మాత్రమే పిచ్చోళ్లు దాడులు చేస్తరా? ఇతర ప్రార్ధన మందిరాల జోలికి వెళ్లరా? అని ప్రశ్నించారు.