Election Campaign: నేటితో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 20వ తేదీన ఒకే విడతలో మహారాష్ట్రలోని 288 స్థానాలకు.. జార్ఖండ్ లో సెకండ్ విడత పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ లో తొలి విడత ఎన్నికల్లో రెండు కూటములు తమకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో జమిలి ఎన్నికల కోసం సన్నాహాలు కొనసాగుతున్న వేళ.. ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపును ఇండియా, ఎన్డీయే కూటములకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే, ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది.
Read Also: Viral News: వీడియో గేమ్‌లో ఓడిపోవడంతో.. తన 8 నెలల కొడుకును గోడకు విసిరేసిన తండ్రి
కాగా, జార్ఖండ్ లో 38 స్థానాలకు, మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొత్త నినాదాలతో ఇండియా, ఎన్డీయే కూటమి పార్టీలు ముందుకెళ్తున్నారు. ప్రచారానికి నేడు చివరి రోజు కావటంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టారు. స్థానిక అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవటానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also: Allu Arjun : పుష్ప -2 ట్రైలర్ పై రాజమౌళి రియాక్షన్.. దటీజ్ బన్నీ
అయితే, మహారాష్ట్రలో రెండు (ఇండియా, ఎన్డీయే) కూటముల మధ్య పోరు జోరు కొనసాగుతుంది. ముంబైలోనూ ఈ సారి గట్టి పోటీ కనబడుతుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 234 జనరల్, 25 ఎస్టీ, 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఇక, 1.85 కోట్ల మంది యువ ఓటర్లు ఈ సారి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా నిలవబోతున్నారు. వారిలో 20.93 లక్షల మంది తొలిసారి ఓటు వేస్తున్నారు. మహాయుతి, ఎంవీఏ కూటములు తమ మేనిఫెస్టోల్లో ప్రధానంగా యువత, మహిళ ఓట్ల కోసం ఎక్కువ హామీలను ప్రకటించారు. అలాగే, ఈ సారి మహారాష్ట్రలో సామాజిక సమీకరణాలు గెలుపు ఓటములను డిసైడ్ చేయబోతుంది.