Kailash Gehlot: ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్.. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం భారతీయ జనాత పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. ఆప్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పదవికి కూడా ఆయన ఆదివారం రాజీనామా చేశారు. కాగా, నజాఫ్‌గఢ్ ఎమ్మెల్యేగా గెలిచిన గహ్లోట్ ఒకప్పుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడు. అయితే, కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిషికి పంపిన రాజీనామా లేఖలో ఆప్ సర్కార్ అమలు చేయలేని వాగ్దానాలు చేస్తోందని ఆరోపించారు. ఇటీవల పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.. ఇవన్నీ తన రాజీనామాకు కారణాలుగా చెప్పుకొచ్చారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్దతతో ఏర్పడిన పార్టీ తన ఆశయాలను నిలబెట్టుకోలేకపోయిందని విమర్శలు గుప్పించారు.
Read Also: Mulugu: ఆ గ్రామానికి అరిష్టం పట్టింది.. జంగాలపల్లిలో వరుస మరణాల కలకలం..
ఇక, ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక వాగ్దానాలను నెరవేర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమయ్యిందని కైలాష్ గహ్లోట్ ఆరోపించారు. యుమనా నదిని స్వచ్ఛమైన జలాలుగా మారుస్తామన్నారు.. కానీ, ఆ పని చేయలేకపోయింది.. బహుశా గతంలో ఎన్నడూ చూడనంత కాలుష్యంలో యుమనా నది కూరుకుపోయందని ఆరోపించారు. కేజ్రీవాల్ కొత్త అధికారిక బంగ్లా ‘శీష్ మహల్’ చుట్టూ వివాదం కొనసాగడంపై కూడా ఆయన మండిపడ్డారు.