జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
టీడీపీ రాజ్యసభ సభ్యులను ఖరారు చేసింది. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేసింది. ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
ఒక దేశం, ఒకే ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఆర్. కృష్ణయ్య మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగనున్నారు.. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు కృష్ణయ్య.. మొత్తం మూడు రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. హర్యానా నుంచి రేఖా శర్మ.. ఒడిశా నుంచి సుజీత్ కుమార్.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్. కృష్ణయ్యను అభ్యర్థులుగా ప్రకటించింది..
అదానీ కేసుపై లోక్‌సభలో విపక్ష ఎంపీలు సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసన తెలిపారు. ఈ నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. నిరసన సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాణికం ఠాగూర్, సప్తగిరి శంకర్ ఉలక ప్రధాని మోడీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాస్క్‌లు ధరించారు. వీరిద్దరినీ ఫొటోలు తీస్తూ.. హడావిడి చేస్తున్న వీడియోను రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. మోడీ, అదానీని ఉద్దేశించి..”వీరిది…
ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ (ఎఫ్డిఎల్-ఎపి)తో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు ద్వారా పంచుకుంది . "కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్న ఆలోచనకు ఈ ఫౌండేషన్ మద్దతు తెలిపింది. భారత అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేయడానికి విదేశీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ" అని పేర్కొంది.
Madhavi Latha: హిందూ గ్రూప్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి కర్ణాటకలోని బీదర్ జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. బీజేపీకి చెందిన తెలంగాణ నేత మాధవి లతతో పాటు ముగ్గురు వ్యక్తులు కార్యక్రమంలో పాల్గొనకుండి నిషేధించారు. కలెక్టర్ నిర్ణయాన్ని హిందూ సంఘాలు విమర్శిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ గిరీష్ బడోలే ఆదేశాల మేరకు మాధవి లత సోమవారం వరకు బీదర్‌లోకి ప్రవేశించకుండా నిషేధాన్ని విధించారు.
Sonia Gandhi: బీజేపీ అమెరికన్ డీప్ స్టేట్, జార్జ్ సోరోస్‌పై విరుచుకుపడుతోంది. గత కొన్నాళ్లుగా బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు అమెరికాలోని డీప్‌స్టేట్, దాని వెనక జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులు కుట్రలు చేస్తు్న్నారని, ఈ కుట్రల వెనక అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మరోసారి పోస్టర్ వార్ మొదలైంది. ఈ రాజకీయ పోరులో ఇరు రాజకీయ పార్టీల నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ తన పోస్టర్లలో 'ఆప్' కుంభకోణాలను బయటపెట్టడంలో బిజీగా ఉంది. అదే సమయంలో ఆప్ కూడా 'పుష్ప' తరహాలో బీజేపీపై విరుచుకుపడింది.
బీజేపీ కొట్లాడితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మం గురించి, రైతుల గురించి, మహిళల గురించి రేవంత్ రెడ్డి పోరాటం చేశారా.. ఓటుకు నోటు కేసు అయింది, దానికే ఆయన జైలుకు పోయారని విమర్శించారు.