తెలంగాణలో నిజమైన మార్పు రావాలంటే నిజమైన ప్రజా ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 12 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదని.. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమ శంఖారావం పూరించామన్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రజల వికాసానికి బీజేపీ పనిచేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ వాళ్ల స్వలాభం కోసం పని చేస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత గురించి విన్నామని.. మోడీ ప్రధాని అయ్యాక ప్రభుత్వ అనుకూలత గురించి వింటున్నామన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగించారు
BJP Poru Sabha: నేడు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో బీజేపీ పోరు సభ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ సభ నిర్వహిస్తోంది.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దూషిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ శుక్రవారం ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టింది. బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, సంబిత్ పాత్రలపై సభాహక్కుల తీర్మానాన్ని తీసుకువచ్చారు. పార్లమెంట్ నడపకుండా చేసే కుట్రలో ఇదొక భాగమని, వారు అదానీ ఇష్యూకి భయపడి దాని నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గర పడుతోంది. ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వం కాలం 2025, ఫిబ్రవరితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ప్రమాణం చేశారు.
కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ సామెత లా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను ఏడాదికాలంగా కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. అబద్ధపు ప్రచారాలతో బాధ్యత రహితంగా పని చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు హామీలను పూర్తి అమలు చేస్తామని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చతికీల పడిందన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఒక పేషెంట్‌కు ఆర్థిక సాయంపై చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారు. గురవారం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఫడ్నవిస్ చేత గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు.