మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ఎట్టకేలకు ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 రోజులకి మహారాష్ట్ర సీఎం ఎంపిక పూర్తయింది.
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ఈ రోజు జరిగిన బీజేపీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరింది. రేపు సాయంత్రం 5 గంటలకు ముంబైలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది.
NVSS Prabhakar : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంబరాలు ఎవరి కోసం చేస్తున్నారని వారికే అర్థం కావడం లేదని, సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన కొద్దీ గంటలకే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. దేశంలోనే వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క అడుగు ముందుకు వేయలేదని, రాజకీయంగా మాదిగలను…
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ ఇటీవల తీవ్ర హింస చెలరేగింది. నగరంలోని షాహీ జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులపై అక్కడి గుంపు రాళ్ల దాడికి పాల్పడింది. వేల మంది దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు.
Eknath Shinde: మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈరోజు (డిసెంబర్ 3) థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక, హస్పటల్ కి తీసుకెళ్లగా, వైద్యులు అతనికి పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
Mamata Banerjee: వక్ఫ్(సవరణ) బిల్లుపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సోమవారం స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మడిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకురావడం అనుమానాలకు కారణమవుతుందని ఆరోపించారు.
మహిళలు గురించి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. దేశ జనాభా తగ్గిపోతుందని.. ఇది ఆందోళనకరమైన అంశాన్ని పేర్కొన్నారు.
BJP Leader Suicide: గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన 34 ఏళ్ల బీజేపీ మహిళా నాయకురాలు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. సూరత్‌లోని వార్డ్ మెంబర్ 30లో దీపికా పటేల్ అనే బీజేపీ మహిళా మోర్చా నాయకులురా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్త రైతు, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు.
Waqf: కేంద్ర వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువస్తోంది. ఇప్పటికే దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్లమెంట్ ఉభయసభలకు చెందిన అధికార, ప్రతిపక్ష ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే కమిటీ తన రిపోర్టుని పార్లమెంట్‌కి సమర్పించాల్సి ఉన్నా, కమిటీ కాల పరిమితిని వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలకు పెంచారు.
MLC Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది ఉత్సవాలను చేస్తుంటే.. కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ ఓర్వలేక పోతుందని విమర్శించారు.