Boora Narsaiah Goud: తెలంగాణ ప్రగతి, ప్రతిష్ట తిరోగమనంలో పయనిస్తోందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్ అంటే ఫాస్టెస్ట్ గగ్రోయింగ్ సిటీ అనే పేరు ఉండేదని, కానీ కాంగ్రెస్ వచ్చాక 6 మోసాలు.. 66 అబద్ధాలు అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు బూర నర్సయ్య. గల్లీలో తిట్లు.. ఢిల్లీలో మెట్లు.. దేవుళ్లపై ఒట్లు.. సర్కార్ దీనికే పరిమితమైందని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదలు ఇప్పటి…
Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయని మాజీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
Jamili Elections: భారతదేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో ఈనెల 16వ తేదీన లోక్సభ ముందుకు వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు వెళ్లబోతుందని అధికారిక వర్గాలు చెప్పుకొచ్చాయి.
ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ బీజేపీలో చేరారు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షతులై ఎత్తుండా గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్.. కమలం పార్టీలో చేరారు.. ఇక, బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార కండవాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు.
LK Advani: భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని అపోలో హస్పటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ కూటమి 233 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. విపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ దారుణ పరాజయం పాలైంది. ఈ కూటమి కేవలం 46 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఉద్ధవ్ శివసేన 20, ఎన్సీపీ శరద్ పవార్ 10, కాంగ్రెస్ 16 సీట్లను…
భారత స్వాతంత్య్ర ఉద్యమం ప్రజాస్వామ్య గళం.. దాని నుంచి ఉద్భవించిందే రాజ్యాంగం అన్నారు. ఇది కేవలం డాక్యుమెంట్ కాదు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మౌలానా ఆజాద్ లాంటి లాంటి వారు ఎంతో మంది ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేశారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
Constitution Debate: భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 సంవత్సరాలు అయినా సందర్భంగా పార్లమెంటులోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ కొనసాగనుంది. ఈరోజు (డిసెంబర్ 13) లోక్సభలో ఉదయం జీరో అవర్ ముగిసిన తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని స్టార్ట్ చేయనున్నారు.
Parliament: ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు’’కి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, డిసెంబర్ 13-14 తేదీల్లో పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని బీజేపీ తన ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసింది. ఉభయసభల్లో ముఖ్యమైన చర్చలకు హాజరుకావాలని కోరింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లుని ఆమోదించిన తర్వాత ఇది జరిగింది.
Loksabha: పార్లమెంట్ లో ఈరోజు (డిసెంబర్ 12) కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ ప్రారంభమైన క్షణం నుంచి అధికార, విపక్ష ఎంపీలు ఆందోళన బాట పట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు.