Bandi Sanjay Kumar: ఒక గ్రామమే పథకాలకు ఎంపికా.. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం చీటింగ్ చేస్తోంది!
- మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదు
- ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే.. ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేర్లనే రాష్ట్రాలు పెట్టాలన్నారు. పేదల ఇళ్ల కోసం కాకుండా.. పేర్ల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేనేలేదని, మండలానికి ఒక గ్రామంలోనే 4 పథకాలకు ఎంపిక చేసి లబ్ది చేయడమేంటి? అని మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… ‘కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదు. పేర్లు మార్చాలనుకుంటే మాత్రం.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుంది. పరిస్థితి అంతవరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ మేం అన్యాయం చేయబోం. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోంది కదా?.. గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంది?, ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు?. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీకి నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు’ అని సెటైర్లు వేశారు.
Also Read
‘రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. గత 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకు పైగా కేంద్రం ఖర్చు చేసింది. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే. రైతు భరోసా, కమ్యూనిటీ హాల్, స్మశాన వాటిక, వీధి దీపాలు, రోడ్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వానివే. 6 గ్యారంటీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేనేలేదు. మండలానికి ఒక గ్రామంలోనే 4 పథకాలకు ఎంపిక చేసి లబ్ది చేయడమేంటి?. మిగిలిన గ్రామాల ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేయలేదా?. రాష్ట్ర ప్రజలను ఇంత దుర్మార్గంగా చీటింగ్ చేస్తారా?. రాష్ట్ర ప్రజలందరికీ లబ్ది చేకూరుస్తామని చెప్పి.. మండలానికి ఒక గ్రామానికి లబ్ది చేకూర్చడం నీచం. కాంగ్రెస్ నేతల జేబుల నుండి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తున్నారా? లేక పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి తెచ్చి ఖర్చు చేస్తున్నారా?. ప్రజలు కట్టిన పన్నులతోనే కేంద్రమైనా, రాష్ట్రమైనా ఖర్చు చేస్తోంది కదా?’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
Also Read: Indiramma Atmiya Bharosa: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై హైకోర్టులో పిల్!
‘గతంలో పీఎం ఆవాస్ యోజన పేరుతో 2 లక్షల 40 వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే.. కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టకుండా ప్రజలను రోడ్డున పడేసింది నిజం కాదా?. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది నిజం కాదా?. పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలి. గద్దర్ కు ఎట్లా పద్మ అవార్డులిస్తాం. ఎంత మంది బీజేపీ కార్యకర్తలను మట్టు పెట్టారో తెలియదా?. వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తే.. నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్. తెలంగాణ సెంటిమెంట్తో ఎవరు లాభపడ్డారో.. ఎవరు బలైపోయారో ప్రజలందరికీ అర్ధమైంది’ అని బండి సంజయ్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?