బీహార్‌లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైయింది. రెండు విడతలు జరిగిన ఓటింగ్‌లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. తొలి విడతలో 65.08 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో రికార్డ్ స్థాయిలో 67.14 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న విడుదల కానున్నాయి.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదు.మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు. ఇళ్లను పడగొట్టడం, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. గర్భిణీ స్త్రీలను వీధుల్లోకి నెట్టారు. ఇది పాలన కాదు - ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ మూకలు దాడి చేయడం పట్ల బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది కార్యకర్తలొచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే.. గాంధీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? రాళ్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలనుకుంటోందా? పిల్లలు, వృద్ధులకు రాళ్లు తగిలితే…
బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ళు విసిరారు. బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకొని బయటకు వచ్చారు. బీజేపీ కార్యాలయం లోపలికి రాళ్ళు విసరడంతో ఒక దళిత మోర్చా కార్యకర్త తలకి గాయాలయ్యాయి. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక్కడ…
హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాలను సమోసా వివాదం కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ వ్యవహారం రచ్చరచ్చ చేస్తోంది. ఇప్పటికే నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సమోసాల మిస్సింగ్‌పై అధికార కాంగ్రెస్ పార్టీ సీఐడీ విచారణకు ఆదేశించడం పెను దుమారం చెలరేగింది
ప్రధాని మోడీ మంగళవారం 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోడీ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా పండుగలా నిర్వహించారు. అన్నదానాలు, రోగులకు పండ్లు పంపిణీ చేయడం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
కరెంటు కోతలపై రాజస్థాన్‌లోని బూండీ జిల్లాలో సోమవారం తీవ్ర దుమారం చెలరేగింది. కరెంటు కోతలు, ట్రాన్స్‌ఫార్మర్లను మార్చడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు, రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
త్రిపుర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్నాలీ గోస్వామిపై భారతీయ జనతా పార్టీ (బీజేపి) కార్యకర్తలు మంగళవారం ధామ్‌నగర్‌లో దాడి చేశారు. దాడి చేసిన వారిలో కొందరు బీజేపీ కౌన్సిలర్లు కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు.
భారతీయ జనతాపార్టీ ప్రపంచంలోనే అతిపెద్దరాజకీయ పార్టీగా అవతరించింది.. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రత్యేక కార్యపద్దతి వల్లే సాధ్యం అయ్యిందన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోమువీర్రాజు.. నెల్లూరులో నిర్వహించిన కిసాన్ మోర్చా శిక్షణ శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన.. బీజేపీ కార్యపద్ధతిపై ప్రసంగించారు.. 1951 నుండి 1977 వరకు భారతీయ జనసంఘ్ రూపంలో కొనసాగింది. ఆ తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత జాతీయవాదం, సుపరిపాలన, పేదల…