ప్రధాని మోడీ మంగళవారం 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోడీ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా పండుగలా నిర్వహించారు. అన్నదానాలు, రోగులకు పండ్లు పంపిణీ చేయడం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల విడుదలపై సీఎం ఆదేశం
ఇదంతా ఒకెత్తు అయితే బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ శ్రేణులు.. విశ్వకర్మ రూపంలో ఆయన చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వకర్మగా మోడీ ఫొటోను రూపొందించి వేద పాఠశాలలో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రధాని మోడీ భారతదేశానికి మోడరన్ విశ్వకర్మగా అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆయా విధాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rajnath singh: కేజ్రీవాల్‌కు నైతిక విలువలు లేవు.. రాజీనామాపై రాజ్‌నాథ్ ఘాటు వ్యాఖ్యలు
మోడీ.. మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా.. అలాగే దేశానికి ప్రధానిగా మూడోసారి పరిపాలన కొనసాగిస్తున్నారు. దేశ చరిత్రలో రికార్డులు మోడీ సొంతం. ఇక మోడీకి వచ్చిన బహుమతులను ఈ వేలం ద్వారా సెప్టెంబర్ 17 నుంచి విక్రయిస్తున్నారు. ఖరీదైన గిఫ్ట్‌లన్నీ ఆన్‌లైన్ వేలంలో ఉంచారు. ఎవరైనా ఈ వస్తువులను సొంతం చేసుకోవచ్చు.
आज विश्वकर्मा पूजा भी है और प्रधानमंत्री मोदी का जन्मदिन भी। इसलिए पटना के वेद स्कूल में बीजेपी कार्यकर्ताओं ने PM मोदी की तस्वीर को भगवान विश्वकर्मा के रूप में बनाया और दूध से अभिषेक भी किया। कार्यकर्ताओं ने बताया कि "PM मोदी आधुनिक भारत के विश्वकर्मा हैं। और देश का पूरी दुनिया… pic.twitter.com/BpVbgPLu5K
— Sachin Gupta (@SachinGuptaUP) September 17, 2024