BJP-Congress: బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరిన యూత్ కాంగ్రెస్.. కార్యకర్తల మధ్య ఘర్షణ
- ప్రియాంక గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు
- బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి
- ఎదురు దాడికి దిగిన బీజేపీ నేతలు
- బీజేపీ నాయకుడికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ళు విసిరారు. బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకొని బయటకు వచ్చారు. బీజేపీ కార్యాలయం లోపలికి రాళ్ళు విసరడంతో ఒక దళిత మోర్చా కార్యకర్త తలకి గాయాలయ్యాయి. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక్కడ వరకు ఎలా రానిచ్చారు అని ప్రశ్నించింది. కాగా.. బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి.. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపు నిచ్చింది. ఇక్కడ ఈ ఘటన చోటుచేసుకుంది.
READ MORE: Yuvaraj Singh: గతంలో నేనెప్పుడూ చూడలేదు.. కోహ్లీ, రోహిత్‌లు అద్భుతం: యువీ
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ఇదిలా ఉండగా.. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీల మధ్య మాటలు హద్దు మీరుతున్నాయి. ఇటీవల ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషిపై బీజేపీ తరపున బిదూరి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనను అభ్యర్థిగా కమలం పార్టీ ప్రకటించింది. అయితే, బిదూరి తాజాగా మాట్లాడుతూ ప్రియాంక గాంధీపై మాట తూలారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని హాట్ కామెంట్స్ చేసి వివాదంలో ఇరుక్కున్నారు.
READ MORE: Formula E Car Race Case : బీఆర్‌ఎస్ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్.. లీగల్ టీమ్‌తో కేటీఆర్ చర్చలు
ఇక, ఈ విషయంపై మీడియా బీజేపీ నేత రమేష్ బిదూరిని ప్రశ్నించగా తాను ఆ వ్యాఖ్యలు చేసింది నిజమేనంటూ ఒప్పుకున్నారు. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హీరోయిన్ హేమమాలినిపై ఇలాంటి కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. లాలూ చేసింది తప్పయితే తనది కూడా తప్పేనని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వైఖరేంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. నిజానికి ప్రియాంక గాంధీ కంటే హేమమాలిని జీవితంలో ఎంతో సాధించారని రమేష్ బిదూరి గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!