కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ… నేపాల్‌లో వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. ఆ దేశ రాజధాని ఖాట్మండులో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. మయన్మార్ నేపాల్ దౌత్యవేత్తగా పనిచేసిన భీమ్ ఉదాస్.. తన కుమార్తె మ్యారేజ్‌కు రాహుల్‌ను ఆహ్వానించగా.. ఆయన అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఖాట్మాండులోని నైట్‌క్లబ్‌లో రాహుల్ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నిజానికి ఈ వీడియోను వైరల్‌గా మార్చింది బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూరప్ పర్యటనపై రాహుల్‌గాంధీ విమర్శలు…
వరంగల్ హనుమకొండ లోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించారు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హన్మంతరావు. అనేక ఉద్యమాలు ఓరుగల్లు నుండే పురుడుపోసుకున్నాయి. మే 6వ తేదీన జరిగే సభ.. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకునే సభ అన్నారు ప్రజలంతా టీఆర్ఎస్ పాలనపై అసహనంతో వున్నారు. వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభతో రాజకీయ మార్పు సంభవిస్తుందన్నారు. ఓట్ బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం కోసం…
రైతుల విషయంలో కేసీఆర్ ఏం చేస్తారో చూద్దాం అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పంటకు కనీస మద్దతు ధర కల్పించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. రాబోయే 2023-2024 ఆర్థిక సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండే అవకాశం లేదు. హరీష్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ చివరి బడ్జెట్ అవుతుందన్నారు. చివరికి రుణమాఫీ కంటే వడ్డీ మాఫీ కార్యక్రమంగా నేను భావిస్తున్నా అన్నారు. కేంద్రంపై ఎంత ఒత్తిడి చేస్తారో చేయండి అన్నారు జీవన్…
కాంగ్రెస్ పిలుపు మేరకు అస్సాం సీఎం పై కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయాల ముట్టడి సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం మార్పు కావాలంటూ కోరుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం మార్పు ఏవిధంగా ఉంటాతో ఈ అక్రమ అరెస్టులు దీనికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రతి భారత పౌరుడికి…
రాష్ట్ర విభజన పై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ కామెంట్లపై మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ నేతలు. మోడీ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. బీజేపీ పలాయన వాదానికి,పసలేని వాదనకు ఇది నిదర్శనం అన్నారు. ప్రధాని మోడీ వైఖరి అత్త చచ్చిన 6 నెలలకు కోడలు వలవలా ఏడ్చినట్లుందన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నర సంవత్సరాలయింది. ఇప్పుడు ఏవిధంగా జరిగింది…
యూపీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. చాలా రోజులుగా మౌనంగా,అజ్ఞాతంలో ఉండిపోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు. యూపీ కాంగ్రెస్ చీఫ్, సీఎం అభ్యర్థినిగా ప్రచారం చేసుకుంటున్న ప్రియాంక గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగారు. కాంగ్రెస్ కేవలం బీజేపీయేతర ఓట్లను చీల్చడానికే తప్ప, ఆ పార్టీతో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు మాయావతి. ఆ పార్టీ సీఎం…