Etela Rajendar: భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా రేవంత్ ప్రమాణం.. ఈటల రియాక్షన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajendar: మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు లభించాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈటల వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. “అమ్మవారి కండువా వేసుకుని ప్రమాణం చేస్తున్నా. ఆధారాలు చూపించాలని ఈటలకు సవాల్ విసురుతున్నా. కేసీఆర్ నుంచి సాయం పొంది ఉంటే మేమే సర్వనాశనమవుతాం. నేను చెప్పింది అబద్ధమైతే.. సర్వనాశనమైపోతాను. ఆధారాలు లేనప్పుడు దేవుడిపై ఆధారపడతాం. గర్భగుడిలో నిలబడి ఒట్టేసి చెప్పా కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ లేదు. ఆధారాలు లేకుండా ఈటల నాపై ఆరోపణలు చేశారు. చివరి బొట్టు వరకు కేసీఆర్‌తో పోరాడతా. ఈటల.. నీలాగా లొంగిపోయిన వ్యక్తిని కాదు. ఈటల రాజేందర్ ఆలోచించి మాట్లాడాలి” అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. రేవంత్ సవాల్‌కు ఈటల తన నివాసం నుంచే సమాధానం ఇచ్చారు. తాను ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానని.. తాను వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ధర్మం కోసం, ప్రజల కోసం అలా మాట్లాడానని అన్నారు. ఎదుటి వారిని కించపరిచే వ్యక్తి కాదన్నారు. సంపూర్ణంగా అందరూ మాట్లాడిన తర్వాత ఈ విషయంపై మాట్లాడతానన్నారు. రేపు మాట్లాడతానన్న ఈటల రాజేందర్.. అందరికీ సమాధానం చెప్తానని అన్నారు.
Also Read
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
Read Also: Revanth Reddy: రూపాయి ముట్టుకున్నా సర్వనాశనమైపోతాం.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్
రాజకీయ నాయకుడు కాన్ఫిడెంట్‌గా ఉండాలని.. నీ మీద నీకు నమ్మకం లేకపోతే కదా దేవుడిపై విశ్వాసం అని ఆయన అన్నారు. అమ్మతోడు.. అయ్యతోడు ఇదేమి కల్చర్ అంటూ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. తాను ఇప్పుడున్న రాజకీయాలపై మాట్లాడానని.. ఎవరెన్ని మాట్లాడినా ప్రజల కోసం ఈటల రాజేందర్ మాట్లాడతాడరన్నారు. తాను ఎవరిపైనా వ్యక్తిగతంగా మాట్లాడలేదని చెప్పారు.
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!