గుజరాత్ లో మరోసారి బీజేపీ జెండా రెపరెపలాడింది. బీజేపీ అద్భుత విజయం సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో పలువురు కేంద్ర మంత్రులను ఢిల్లీలో స్వయంగా కలసి వినతి పత్రాలు ఇచ్చిన సోము వీర్రాజు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి ఎలా ఉంటుందని నిరూపించి అభివృద్ది నినాదంతో గుజరాత్ విజయం ఆల్ టైమ్ రికార్డ్ గా గుజరాత్ రాజకీయాల్లో కొత్త చరిత్రను సృష్టించడం జరిగిందని సోమువీర్రాజు పేర్కొన్నారు.
Read Also: Himachal Pradesh Results: గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన జైరాం ఠాకూర్.. సీఎం రేసులో వారే!
ఏడు పర్యాయాలు వరుస విజయాలే కాదు గెలుపొందిన స్ధానాల్లో మెజార్టీలు కూడా పెరగడమే ఈ విజయాలు వెనుక ప్రజలు ఏవిధంగా మద్దతు పలుకుతున్నారనేది అర్ధం చేసుకోవాలన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక కుట్ర జరుగుతోంది. అవశేషాంధ్రప్రదేశ్ గా ఏర్పడిన తరువాత మాజీ ఎంపి ఉండవల్లి అందుకు కౌంటర్ గా సజ్జల రామక్రుష్ణారెడ్డి వ్యాఖ్యలు పరిశీలిస్తే అనవసర చర్చ ను ఎపి ప్రజల పైరుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎపి ప్రజలు గుజరాత్ ఫలితాలను ఆస్వాదిస్తున్న తరుణంలో విభజన అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చి మీడియాలో అనవసర చర్చకు ఆజ్యం పోయాలని చూస్తున్నారని సోమువీర్రాజు విడుదల చేసిన ప్రకటనలో వైసీపీ అనుసరిస్తున్న తీరును ఆక్షేపించారు.
బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి వైసీపీ తీరుని ఎండగట్టారు. మళ్లీ వైసీపీ – టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు మొదలు పెట్టాయి.వీలైతే ఏపీ, తెలంగాణలను కలపడం మంచిది.అదే మా వైఎస్సార్సీపీ విధానమని సజ్జల అనడం బూటకం.వైసీపీ విధానం సమైక్యతే అయినప్పుడు.. సుప్రీం కోర్టులో ఆంధ్ర-తెలంగాణ విభజన కేసులు మూసేయండని వైసీపీ ప్రభుత్వం పిటీషన్ ఎందుకు వేసింది?వైసీపీది ఢిల్లీలో ఒక మాట, ఆంధ్రా గల్లీలో మరో మాట.వైసీపీ నేతలు ప్రజలను ఎందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు..? అని ఆయన ప్రశ్నించారు.
National Wise Pending Cases: దేశంలో ఎన్ని పెండింగ్ కేసులున్నాయో తెలుసా..?