భారత్ జోడో యాత్రకు రంగం సిద్ధం చేస్తుంది ఏఐసీసీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీతో కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షుల భేటీ ముగిసింది…12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 3500 కి.మీ సాగనుంది ఈ పాదయాత్ర…దేశాన్ని కాపాడేందుకే కాంగ్రెస్ జోడో యాత్ర సాగుతుందన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇంచార్జి జనరల్ సెక్రటరీలు, భారత్ జోడో యాత్ర కోఆర్డినేటర్స్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, దిగ్విజయ సింగ్, జైరామ్ రమేష్ సమీక్ష నిర్వహించారు.
భారత్ జోడో యాత్రపై అందరికీ సూచనలు చేశారు. ఢిల్లీలో సెప్టెంబర్ 4న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నాం. నిత్యావసర ధరల పెరుగుదల, తీవ్రమైన నిరుద్యోగ సమస్య, అవినీతి, రాజకీయ ఫిరాయింపులతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టడం, సీబీఐ, ఈడీ వంటి సంస్థలను తమ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్‌గా మార్చుకుని రాజకీయ కక్షసాధింపులకు వినియోగిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన సాగుతుందన్నారు. 4న ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమంలో తెలంగాణ నుంచి వివిధ స్థాయిల్లోని నేతలందరూ వస్తారు.
Read Also: Supreme Court dismisses PIL Rafael inquiry: రఫేల్ ఒప్పందంపై పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీం
సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్రలో టీపీసీసీ క్రియాశీలంగా వ్యవహరిస్తుంది.భారత్ జోడో యాత్ర తెలంగాణలో 14-15 రోజుల పాటు 360-370 కి.మీ మేర సాగనుంది. దేశాన్ని ఏకంగా ఉంచడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి, ప్రజలకు మనోధైర్యాన్ని కల్గించడానికి 160-170 రోజుల పాటు ఏకధాటిగా రోజుకు 25 కి.మీ నడుస్తూ సమాజంలో అన్ని వర్గాలను కలిసి, వారి సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకుంటారు. 2024లో అధికారంలోకి వచ్చి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించకుండా కట్టడి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తారు
భాష, మతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి.. ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా చేస్తోంది. దేశాన్ని చీల్చే ప్రయత్నాన్ని తిప్పికొట్టడం కోసమే భారత్ జోడో యాత్ర. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం బలయ్యారే తప్ప దేశాన్ని బలికానివ్వలేదు. బీజేపీ రూ. 6,300 కోట్ల ఖర్చుతో 8 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను పడగొట్టింది. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం సాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులే కాదు,
తెలంగాణ సమాజం మొత్తం ఈ యాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అంటే పార్టీ ఫిరాయింపుల రాష్ట్రంగా, అవినీతి రాష్ట్రంగా, అత్యాచారాల రాష్ట్రంగా.. చివరకు అన్ని అరాచకాలకు ప్రయోగశాలగా కేసీఆర్ మార్చారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో ఈ అంశాలు కూడా జోడించి.. మోదీ – కేసీఆర్ కారణంగా రాష్ట్రానికి, దేశానికి జరిగిన నష్టాన్ని వివరిస్తాం. ఈ నేతలను ప్రజా జీవితం నుంచి బహిష్కరించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం అన్నారు రేవంత్ రెడ్డి.
భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల పై జరిగిన సమీక్ష సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్. సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటలకు సర్వమత ప్రార్థనలు చేయాలన్నారు. సెప్టెంబర్ 8 న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ప్రారంభంచబోయే సుదీర్ఘ పాదయాత్ర కు సంఘీభావంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్లాక్, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు 10 కిలోమీటర్ల మేరకు పాదయాత్రలు వుంటాయన్నారు శైలజానాథ్.