Chhattisgarh: బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఇరు వర్గాల మధ్య ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజాపూర్ పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌ని భద్రత బలగాలు చేపడుతున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటన జరిగిన ప్రాంతం గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని పోలీస్ అధికారులు తెలిపారు.
హతమైన నక్సలైట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి హతమైన నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్, దంతేవాడ మరియు సుక్మా జిల్లాకు చెందిన 1200 మంది DRG, STF, COBRA మరియు CRPF సిబ్బంది నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌కు వెళ్లారు. ఉదయం 6 గంటల నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. అగ్రశ్రేణి నక్సల్స్ నేతలు ఉన్నారన్న సూచనతో ఈ ఆపరేషన్‌ను ప్రారంభించారు. బస్తర్ ఐజీ, మూడు జిల్లాల డీఐజీ, ఎస్పీలు ఆపరేషన్, ఎన్‌కౌంటర్‌పై నిఘా పెట్టారు. భద్రతా సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Also Read
- Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
Read Also: Night Shifts: కేవలం 3 నైట్ షిఫ్టులు చాలు షుగర్, ఊబకాయం రావడానికి.. అధ్యయనంలో వెల్లడి..
గత కొన్ని రోజులుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ అణిచివేత కార్యక్రమాలు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ 16న రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు 29 మంది నక్సలైట్లను హతమార్చాయి. దీంట్లో కీలకమైన మావోయిస్టు నేతలు మరణించారు. కాంకేర్ ఎన్‌కౌంటర్ తర్వాత సుక్మా జిల్లాలో ఆరుగురు నక్సలైట్లు లొంగిపోయారు. వీరందరిపై రూ. 36 లక్షలు రివార్డు ఉంది. ఏప్రిల్ 29న 23 మంది, ఏప్రిల్ 15న 26 మంది నక్సలైట్లు లొంగిపోయారు.
#WATCH | Chhattisgarh CM Vishnu Deo Sai says, "An encounter broke out with the Naxals in Gangaloor area of Bijapur district…12 dead bodies of the Naxals have been found. I congratulate our jawans & senior officers…" https://t.co/OXMg9oAXUO pic.twitter.com/I9woGLlGRf
— ANI (@ANI) May 10, 2024
తాజావార్తలు
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
ట్రెండింగ్
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?