పిల్లలు అంటే తల్లితండ్రులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నతనం నుంచి వారు ఏమి చేసినా అల్లారుముద్దుగా పెంచుతారు. ఎంత కష్టం వచ్చినా వారికి చెప్పకుండా వారు జీవితంలో ఏం కావాలనుకుంటారో దానికోసం కష్టపడుతుంటారు. అయితే కొంతమంది తండ్రులు మాత్రం కసాయిలుగా మారుతున్నారు. వారు చెప్పిన మాట వినకపోతే కర్కశంగా కన్నబిడ్డలను పొట్టన పెట్టుకుంటున్నారు. తాజాగా ఒక కసాయి తండ్రి, కూతురు చెప్పిన మాట వినలేదని అతి దారుణంగా కొట్టి చంపిన ఘటన బీహార్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని దర్బంగాకు చెందిన ఒక కుటుంబం కూలి పనులు చేసుకుంటూ నివసిస్తోంది. ఆ ఇంటి యజమానికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి పెళ్లి చేసి పంపించగా చిన్న కూతురు అఫ్రీన్ (20) చదువుకుంటుంది. అయితే రెండు రోజుల క్రితం నుంచి ఆమె కనిపించడంలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లి, అక్క పోలీసులకు మిస్సింగ్ కంప్లైట్ ఇచ్చారు. పోలీసులు ఆమె కోసం అన్ని చోట్లా వెతకడం మొదలుపెట్టారు. ఈలోపు అక్క ఫోన్ కు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో చూసి తల్లి కూతుళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కన్నా తండ్రే అతి దారుణంగా కూతురును చంపుతున్న వీడియో అది. ఆ వీడియోలో నాన్నా.. నన్ను వదిలేయ్.. చాలా నొప్పిగా ఉంది.. ఈ దెబ్బలను తట్టుకోలేకపోతున్నా.. కావాలంటే విషం పెట్టి చంపు.. నేను చచ్చిపోవడమేగా నీకు కావాల్సింది.. ప్లీజ్ నాన్న.. నన్ను వదిలేయ్ అంటూ వేడుకొంటుంది అఫ్రీన్.. కూతురు మాటలు ఏమి పట్టని తండ్రి అతి దారుణంగా ఆమె ప్రాణం పోయేవరకు కొట్టి కొట్టి చంపాడు.
అనంతరం ఇంట్లో ఎవరికి తెలియకుండా శవాన్ని ఊరి చివరున్నా బావిలో పడేశాడు. అయితే అతనికి తెలియని విషయం ఏంటంటే.. కూతురు తనని గదిలో బంధించినప్పుడే తన ఫోన్ లో వీడియో ఆన్ చేసి పెట్టింది. దీంతో ఈ ఘాతుకం అంత ఆ ఫోన్ లో రికార్డు అయ్యింది. చివరి నిమిషంలో ఆ వీడియోను అక్కకు పంపి ప్రాణాలు విడిచింది. ఇక ఈ వీడియోను తల్లి కూతుళ్లు పోలీసులకు సబ్మిట్ చేయగా నిందితుడిని అరెస్ట్ చేసి.. అసలు ఎందుకు కూతురు ప్రాణాలు తీసావ్ అని అడగగా.. ఒక 50 ఏళ్ళ వ్యక్తి తన కూతురును పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, ఆ పెళ్ళికి తన కూతురు ససేమిరా అందని, చదువుకుంటాను అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి కోపంలో చంపేసానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన బీహార్ లో సంచలనం రేపుతోంది.