Bihar Crime News: దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: దసరా ఉత్సవాల్లో అపశృతి దొర్లింది . పండగపూట పెను విషాదం చోటు చేసుకుంది. సంతోషంగా అమ్మవారి దర్శనానికి వెళ్లిన వారు తొక్కిసలాట కారణంగా ప్రాణాలను కోల్పోయారు.ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. బీహార్ లోని రాజా దళ్ ప్రాంతంలో దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గా పూజ వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి భద్రత చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడం కారణంగా తొక్కసలాట నెలకొంది. ఈక్రమంలో ఓ 5 ఏళ్ళ బాలుడు తో పాటుగా ఇద్దరు మహిళలు మృతి చెందారు.
Read also:US: H-1B వీసా ప్రక్రియలో US కొత్త ప్రతిపాదనలు ఇవే ..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ఈ ఘటన పైన గోపాల్ గంజ్ ఎస్పీ స్వర్ణ ప్రభాత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో రాజాదలళ్ పూజా పండల్ గేటు దగ్గర తొక్కిసలాట జరిగిందని.. ఈ క్రమంలో ఓ 5 ఏళ్ళ బాలుడు కింద పడిపోయాడని.. ఆ చిన్నారిని రక్షించేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించగా ఆ ఇద్దరు మహిళలు కూడా కొంద పడిపోయారని.. అదే సమయంలో భక్తులు ప్రసాదం కోసం బారులు తీరడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముగ్గురు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లారని.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే లోపే మరణించారని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించినట్లు తెలిపారు. కాగా ఈ ఘటనలో మరో 10 మంది గాయపడగా గాయపడినవారిని వారిని సదర్ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం కారణంగానే మండపం వద్ద తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!