Bihar: యూట్యూబ్ లో ఫెమస్ అయితే చంపేస్తారా..? ఇదెక్కడి న్యాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Crime News: కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అంటే ఏ పని చేసిన పిడికెడు అన్నం కోసమే. దాని కోసం మనిషి నానాయాతన పడుతుంటారు. ప్రస్తుతం యూట్యూబ్ హావ నడుస్తుంది. కొందరు నేమ్, ఫేమ్ కోసం యూట్యూబ్ ని ఎన్నుకుంటే.. కొందరు వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి యూట్యూబ్ ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్ లో క్లిక్ అయితే నేమ్, ఫేమ్ తోపాటు మంచి సంపాదన కూడా వస్తుంది. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఓ ఆసరా దొరుకుతుంది అనుకునే వాళ్ళు ఎందరో. అయితే ఆ యూట్యూబ్ లో ఫేమ్ రావడం తో ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే..బీహార్ లో హరధన్ అనే 19 ఏళ్ళ యువకుడు తండ్రిని కోల్పోయాడు. దీనితో కుటుంబ భారం ఆ యువకుడి పైన పడింది. ఈ నేపథ్యంలో తన తల్లిని, ఇద్దరు సోదరీమణులను పోషించుకునేందుకు హరధన్ యూట్యూబ్‌లో ట్యూషన్లు మరియు రీల్స్ అప్‌లోడ్ చేసేవాడు.
Read also:Plane Crashed: కుప్పకూలిన మనంగ్ ఎయిర్ హెలికాప్టర్.. పైలట్ ఏమయ్యాడంటే
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
కాగా హరధన్ కి యూట్యూబ్ లో మంచి గుర్తింపు వచ్చింది. హరధన్ కి వచ్చిన ఈ ఫేమ్ అతని మరణానికి కారణం అయింది. హరధన్ కి నేమ్, ఫేమ్ రావడాన్ని చూసి ఓర్వలేని వ్యక్తులు బీహార్‌లోని నలందలో తన ఇంట్లో నిద్రిస్తున్న హరధన్ ను పదునైన కత్తితో విచక్షణారహితంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు గుమిగూడి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో హరధన్ సోదరి మాట్లాడుతూ తనకి యూట్యూబ్ లో ఫేమ్ రావడం వల్లనే అతన్ని హత్య చేశారని తెలిపింది. కాగా ఈ హత్యకు కేవలం యూట్యూబ్ ఫేమ్ మాత్రమే కారణమా..? లేక వేరే కారణాలు ఎం అయినా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!