Bihar Elections: మరికాసేపట్లో మలి విడత పోలింగ్ ప్రారంభం.. ‘‘సీమాంచల్’’ ఓటుపై పార్టీలు ప్రత్యేక దృష్టి
- మరికాసేపట్లో మలి విడత పోలింగ్
- ‘‘సీమాంచల్’’ ఓటుపై పార్టీలు ప్రత్యేక దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహర్‌లో మరికాసేపట్లో మలి విడత పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇక తొలి విడతలో రికార్డ్ స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతలో కూడా అదే మాదిరిగా పోలింగ్ నమోదయ్యేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడతలో 121 స్థానాల్లో ఓటింగ్ జరగగా.. రెండో విడతలో 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
మలి విడతలో ‘సీమాంచల్’ పోలింగ్‌పై ప్రాధాన్యత సంతరించుకుంది. సీమాంచల్ అనగానే ఆర్జేడీకి కంచుకోటలాంటిది. ఇక్కడ ఆర్జేడీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. ఆర్జేడీ 33, జేడీయూ 20, కాంగ్రెస్ 11, వామపక్షాలు 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిగా ఉన్నప్పుడు 80 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ కేవలం 36 స్థానాలకే పరిమితం అయింది. సీమాంచల్‌లో ఎక్కువుగా ముస్లింలు, యాదవ్‌లు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో మహాఘట్‌బంధన్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
మలి విడతలో మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఎన్నికల బరిలో 1,302 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా… ఇందులో ప్రత్యేకగా 136 మంది మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం. 176 మందిని ఎన్నికల పరిశీలకులుగా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అలాగే గట్టి పోలీస్ బందోబస్త్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీపావళి, ఛత్ పండుగ కోసం బీహారీయులంతా సొంత గ్రామాలకు రావడంతో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారే విజయాలపై అంచనాలు వేసుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
-
Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్‌ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
-
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!