దేశ రాజధాని ఢిల్లీతో పాటు బీహార్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం 8.02 గంటలకు బీహార్ రాష్ట్రంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శివాన్‌లో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4గా నమోదైంది. ప్రకంపనలకు ప్రజలు భయపడి ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు అధికారులు అప్రమత్తమై పరిస్థితులను పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: French Man Murdered: ఫోర్ట్‌నైట్ గేమ్‌లో ఓడిపోయిన ఫ్రెంచ్ వ్యక్తి.. కోపంతో 11 ఏళ్ల బాలిక హత్య
తొలుత ఈ ఉదయం తెల్లవారుజామున 5:36 గంటలకు ఢిల్లీలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లో భూమి కంపించింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని స్థానికులు చెప్పుకొచ్చారు. భూప్రకంపనలకు ఇళ్లల్లోని వస్తువులు ఊగిసలాడాయి. దీంతో భయంతో ఇళ్లల్లోంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలో మీటర్లు మాత్రమేనని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Kesineni Nani: పొలిటికల్ రీఎంట్రీ.. మాజీ ఎంపీ కేశినేని నాని కీలక ప్రకటన!
ఇక భూప్రకంపనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఏ ఒక్కరూ కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దని.. అందరు ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అయితే మరోసారి భూ ప్రకంపనలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడీ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: UK PM Keir Starmer: అవసరమైతే మా సైన్యాన్ని ఉక్రెయిన్‌కు పంపడానికి సిద్ధంగా ఉన్నాం..
An earthquake with a magnitude of 4.0 on the Richter Scale hit Siwan, Bihar at 08:02 IST today
(Source – National Center for Seismology) pic.twitter.com/mNcVErOpq6
— ANI (@ANI) February 17, 2025