బీహార్ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక సూచనలు చేసింది. ఏఐ-జనరేటెడ్ వీడియోలను దుర్వినియోగం చేయవద్దని రాజకీయ పార్టీలను హెచ్చరించింది. ఎన్నికల వాతావరణం కలుషితం కాకుండా సోషల్ మీడియా పోస్టులపై కఠినమైన నిఘా ఉంచినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల్లో డీప్‌ఫేక్‌లను సృష్టించడానికి లేదా సమాచారాన్ని వక్రీకరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) అమల్లోకి వచ్చినందున సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లేదా ప్రకటనల రూపంలో ప్రచారం కోసం షేర్ చేయబడిన అల్-జనరేటెడ్ లేదా సింథటిక్ కంటెంట్‌ను ప్రముఖంగా లేబుల్ చేయాలని ఎన్నికల అథారిటీ గురువారం ఒక ప్రకటనలో పార్టీలకు గుర్తు చేసింది.
ఇది కూడా చదవండి: Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఇంట్రెస్టింగ్ ఫైటింగ్.. ఢీకొట్టబోయేది ఎవరిని అంటే..!
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 14న జరగనుంది. ఓ వైపు ఎన్డీఏ-ఇండియా కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తుండగా.. ఇంకోవైపు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల అరంగ్రేటంతో పోరాడుతున్నారు. అయితే ఈసారి ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: China: చైనాలో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు