Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఇంట్రెస్టింగ్ ఫైటింగ్.. ఢీకొట్టబోయేది ఎవరిని అంటే..!
- తొలి జాబితాలో లేని ప్రశాంత్ కిషోర్ పేరు
- ప్రశాంత్ కిషోర్ ఇంట్రెస్టింగ్ ఫైటింగ్
- ఢీకొట్టబోయేది ఎవరిని అంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగబోతుంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రతిపక్ష కూటమి తహతహలాడుతున్నాయి.
ఇదిలా ఉంటే గురువారం 51 మందితో కూడిన తొలి జాబితాను ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ విడుదల చేశారు. అయితే ఫస్ట్‌లిస్ట్‌లో మాత్రం ప్రశాంత్ కిషోర్ పేరు లేదు. అయితే దీని వెనుక చాలా వ్యూహం ఉందని సమాచారం.
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ఇది కూడా చదవండి: China: చైనాలో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
రాఘోపూర్‌లో ఆర్జేడీకి మంచి పట్టు ఉన్న అసెంబ్లీ స్థానం. తేజస్వి యాదవ్ ఇక్కడ నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. రాఘోపూర్ లేదా సొంత నియోజకవర్గం కర్గహార్ నుంచైనా తేజస్వి యాదవ్ పోటీ చేసే ఛాన్సుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పేరు తొలి జాబితాలో లేదు. ఇక రితేష్ రంజన్ పాండేను కర్గహార్ అభ్యర్థిగా తొలి జాబితాలో పేరు వచ్చేసింది. ఇక రాఘోపూర్ మిగిలి ఉంది. ఇక్కడ నుంచే తేజస్వి యాదవ్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచే ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌ను సరిదిద్దేందుకు వచ్చిన ‘‘బీహార్ బిడ్డ’’గా ప్రశాంత్ కిషోర్ అభివర్ణించుకున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi-Keir Starmer: బీచ్ ఒడ్డున మోడీ-స్టార్మర్ ముచ్చట్లు.. ఎదురెదురుగా కూర్చుని కబుర్లు
ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంతి కిషోర్ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం విడుదల చేశారు. 51 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. 16 శాతం ముస్లింలకు కేటాయించగా.. 17 శాతం అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారికి కేటాయించారు. జాబితాలో తరతరాలుగా పాఠ్యపుస్తకాలు రాసిన గణిత శాస్త్రజ్ఞుడు అన్నాడు. అలాగే మాజీ అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వైద్యులు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో 48 శాతం ఓట్లు తమకు లభిస్తాయని ప్రశాంత్ కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో రెండు కూటములు 72 శాతం ఓటర్లను మాత్రమే సాధించాయని గుర్తుచేశారు.
ఇక అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి అవినీతి లేనివారిని ఎంపిక చేసినట్లుగా ప్రశాంత్ కిషోర్ తెలిపారు. క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలనే అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చారు. అభ్యర్థుల్లో ఒక ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు ఉన్నాడని తెలిపారు. కుమ్రార్‌లో నిలబెట్టిన అభ్యర్థి కేసీ. సిన్హా.. పాట్నా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆయన రచించిన పుస్తకాలు దశాబ్దాలుగా బీహార్, అనేక ఇతర రాష్ట్రాలలోని పాఠశాలల్లో పొందిపరిచారు.
మాంఝీ నుంచి వైబీ.గిరిని నిలబెట్టారు. ఈయన పాట్నా హైకోర్టులో సీనియర్ న్యాయవాది. హై ప్రొఫైల్ కేసుల్లో కీలక పాత్ర పోషించారు. బీహార్ అదనపు అడ్వకేట్ జనరల్‌గా, పాట్నా హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ కేసులకు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు.
ఇక ముజఫర్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ అమిత్ కుమార్ దాస్.. పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పూర్వ విద్యార్థి. గ్రామీణ ప్రాంతాలకు అవగాహన కల్పించడానికి.. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను విస్తరించడానికి విశేష కృషి చేశారు. ఆయన భార్య కూడా డాక్టర్. ముజఫర్‌పూర్‌లో ఒక ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 14న జరగనుంది. ఓ వైపు ఎన్డీఏ-ఇండియా కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తుండగా.. ఇంకోవైపు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల అరంగ్రేటంతో పోరాడుతున్నారు. అయితే ఈసారి ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!