Tejashwi Yadav: 18నే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తా.. గెలుపుపై తేజస్వి యాదవ్ ధీమా
- నవంబర్ 18నే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తా
- గెలుపుపై తేజస్వి యాదవ్ ధీమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 14న ఎన్నికల ఫలితాలు వస్తాయని.. 18న ప్రభుత్వం ఏర్పడుతుందని.. అదేరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ప్రధాని మోడీ గమనించాలన్నారు. నేరం జరగకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదన్నారు. మహాఘట్‌బంధన్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో మార్పు వస్తుందని చెప్పారు. కులమతాలతో సంబంధాలు లేకుండా ఈనెల 26 నుంచి నేరస్థులందరినీ జైలుకు పంపిస్తామని తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Trump: తైవాన్ జోలికి పోవద్దు.. చైనాకు వార్నింగ్.. కొద్దిరోజులకే మారిన ట్రంప్ స్వరం
Also Read
బీహార్‌లో తొలి విడత పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. గురువారమే మొదటి విడత పోలింగ్ జరగనుంది. దీంతో మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. దీంతో ప్రచారానికి సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి.
ఇది కూడా చదవండి: Trump: పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
బీహార్‌లో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత పోలింగ్ నవంబర్ 6 (గురువారం), రెండో విడత పోలింగ్ నవంబర్ 11న (మంగళవారం) జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ పేరును ప్రతిపక్ష కూటమి ప్రకటించగా… ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి పేరు మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇటీవల మోడీ మాట్లాడుతూ.. నితీష్ నాయకత్వంలో మరోసారి విజయం సాధిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!