బీహార్‌లో ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. సమయం దగ్గర పడడంతో నాయకులు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇక అధికార-విపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న రాహుల్ గాంధీ.. మోడీ లక్ష్యంగా విమర్శలు చేయగా.. ఈరోజు ప్రధాని మోడీ.. విపక్ష కూటమి టార్గెట్‌గా ధ్వజమెత్తారు.
బీహార్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు వారం రోజుల సమయమే మిగిలి ఉంది. ఇక దీపావళి, ఛత్ పండుగలు ముగియడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నాయకులంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ, అమిత్ షా, కేంద్రమంత్రులు జోరుగా ప్రచారం చేస్తుండగా.. గురువారం ప్రధాని మోడీ పలుచోట్ల ర్యాలీలు నిర్వహించనున్నారు.
Amit Shah: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యాఖ్యల పదును పెరిగింది. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అని స్పష్టం చేశారు.
Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ ఓట్ల కోసం ఏదైనా చేస్తారని ఆరోపించారు. ‘‘ మీ ఓట్ల కోసం నరేంద్రమోడీని డ్యాన్స్ చేయమని అడిగితే, అతను వేదికపైనే డ్యాన్స్ చేస్తారు’’ అని ముజఫర్‌పూర్ లో తేజస్వీ యాదవ్‌తో కలిసి ఉమ్మడి ర్యాలీలో రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని మోడీ-ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సారధ్యంలో అభివృద్ధిలో బీహార్ కొత్త శిఖరాలకు చేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఉధృతం చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మహా కూటమి శుక్రవారం తన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనికి “బీహార్ కా తేజస్వి ప్రణబ్” అని పేరు పెట్టారు. తేజస్వి యాదవ్ నాయకత్వంలో విడుదల చేసిన ఈ మానిఫెస్టోలో, ఉపాధి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తామని మహా కూటమి హామీ ఇచ్చింది. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల వాగ్దానాలు మాత్రమే కాదని, బీహార్ పునర్నిర్మాణానికి ఒక బ్లూప్రింట్ అని మహా కూటమి పేర్కొంది.…
Bihar Elections 2025: దేశం దృష్టిని ఆకర్షించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జన్ సురజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. పలు నివేదికల ప్రకారం.. పీకే పేరు బీహార్, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాల ఓటర్ల జాబితాలలో కనిపిస్తుంది. దీంతో రెండు ఓటరు ఐడి కార్డులు కలిగి ఉన్న కారణంగా ఎన్నికల కమిషన్ ఆయనకు తాజాగా నోటీసు జారీ చేసింది. దీనిపై కమిషన్ మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పీకేను కోరింది. READ…
బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా దూకుడుగా వెళ్తున్నాయి. ఇక బీహార్ ఎన్నికల వేళ జాన్ సూరాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి కీలక సలహా ఇచ్చారు.
బీహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఇక వారం రోజులే మిగిలుంది. ఇంకోవైపు రాష్ట్రంలో ఛత్ పండుగ సందడి సాగుతోంది. రాష్ట్రమంతా కోలాహలంగా ఉంది. ఈరోజుతో ఛత్ పండుగ ముగియనుంది. ఇక ఓట్ల పండుగ ప్రారంభం కానుంది.
ఎన్నికల సంఘం SIR రెండవ దశను ప్రకటించింది. బీహార్ తరువాత, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభం కానుంది. వీటిలో అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఓటర్లు SIR కోసం సమర్పించాల్సిన పత్రాల జాబితాను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. మీ వద్ద ఈ పత్రాలు ఉంటే, మీరు వాటిని మీ…