Bihar Election: నేడు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల.. ప్రధాన హామీ ఇదే!
- బీహార్‌లో కొనసాగుతున్న ఎన్నికల సమరం
- నేడు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల
- ప్రధాన హామీ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఇక వారం రోజులే మిగిలుంది. ఇంకోవైపు రాష్ట్రంలో ఛత్ పండుగ సందడి సాగుతోంది. రాష్ట్రమంతా కోలాహలంగా ఉంది. ఈరోజుతో ఛత్ పండుగ ముగియనుంది. ఇక ఓట్ల పండుగ ప్రారంభం కానుంది. బీహారీయులు తిరిగి పనుల నిమిత్తం బయట రాష్ట్రాలకు వెళ్లిపోకుండా పార్టీలు పక్కా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అన్ని పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన.. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడి
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఇదిలా ఉంటే మంగళవారం మహాఘటబంధన్ మేనిఫెస్టో విడుదల కానుంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాట్నాలో మేనిఫెస్టో విడుదల చేసి అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీహార్ అంతటా ర్యాలీలు, బహిరంగ సమావేశాలను ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Cyclone Montha: 10 జిల్లాలపై మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు..
ఇక మేనిఫెస్టోలో ప్రధానంగా ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అనే హామీ ఉండొచ్చని తెలుస్తోంది. ఇటీవలే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యమేనని తెలిపారు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో ఈ హామీ ఉండొచ్చని సమాచారం. అలాగే వృద్ధాప్య పింఛన్‌ను కూడా పెంచొచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా జీవికా దీదీలను పర్మినెంట్ చేసి రూ.30,000 జీతం ఇవ్వనున్నారు. యువత, మహిళలను ఆకట్టుకునేలా హామీల వర్షం కురిపించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది.
ఇదిలా ఉంటే ఎన్నికల వేళ ఆర్జేడీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న 27 మంది నాయకులను ఆర్జేడీ బహిష్కరించింది. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..