బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల వ్యూహాకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీకి 150 సీట్లు వస్తాయని.. లేదంటే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎవరితో పొత్తు పెట్టుకోలేదని.. ఎన్నికల తర్వాత కూడా ఎవరితో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Bengaluru: దారుణం.. అబ్బాయితో తిరగొద్దన్న పాపానికి తల్లిని చంపిన కుమార్తె
ప్రస్తుతం బీహార్‌లో 160-170 సీట్ల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని.. 150 కంటే ఎక్కువ సీట్లే జన్ సురాజ్ పార్టీకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. బీహార్‌లో జన్ సురాజ్ పార్టీని ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవడంతో ప్రజలు నిరాశ చెందారని.. అయినా తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఒకవేళ పోటీ చేస్తే కార్‌గఢ్ నుంచి పోటీ చేస్తానని చెప్పానని.. అయినా కూడా అది నిజం కాదని చెప్పానన్నారు. బీహార్‌లోని 1/3 వంతు ప్రజలు అధికార-ప్రతిపక్ష కూటమిలకు ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ జన్ సురాజ్ పార్టీనే ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: JD Vance: భార్య మతంపై జేడీ వాన్స్ మరోసారి కీలక ప్రకటన
బీహార్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఒకరు అధికారం నిలబెట్టుకునేందుకు.. ఇంకొకరు అధికారం కోసం పోరాటం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Yuvraj Singh: ఐపీఎల్లోకి యువరాజ్ సింగ్ రీఎంట్రీ.. ఆ జట్టు హెడ్ కోచ్‌గా..?