బిగ్ బాస్ హౌస్ లో కొందరి ప్రవర్తన చూస్తుంటే ‘కుక్కతోక వంకర’ అనే సామెత గుర్తొస్తోంది. అందుకు ఉదాహరణగా సిరి, ప్రియాంక బిహేవియర్ ను చెప్పుకోవచ్చు. షణ్ముఖ్ తో బయట పెద్దంత పాజిటివ్ వైబ్స్ లేవని, కానీ హౌస్ లోకి వచ్చాకే తనకు దగ్గర అయ్యాడని సిరి పలు మార్లు చెప్పింది. ఇక మానస్ – ప్రియాంక మధ్య పరిచయం హౌస్ లోకి వచ్చిన తర్వాతే జరిగింది. అయితే ఈ పదకొండు వారాల్లో వీరిద్దరూ మానసికంగా దగ్గరయ్యారు.…
బిగ్ బాస్ సీజన్ 5 కథ కంచికి చేరే సమయం ఆసన్నం కావడంతో హౌస్ మేట్స్ మధ్య వాదోపవాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో కెప్టెన్ తప్ప అంతా నామినేషన్స్ కు గురవుతామనే విషయం తెలిసి కూడా, ఎవరి వాదనలు వారు వినిపించే క్రమంలో గట్టిగా అరుచుకుంటూ, వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. సోమవారం నామినేషన్స్ సమయంలో సన్నీ, శ్రీరామచంద్ర మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మధ్యలో మానస్ వచ్చి వారిని…
బిగ్ బాస్ సీజన్ 5 షో స్పాన్సర్స్ ఒక్కో వారం ఇద్దరేసి చొప్పున హౌస్ మేట్స్ కు అదనపు బహుమతులను ఇస్తూ తమ ప్రాడక్ట్స్ కు చక్కని ప్రచారం చేసుకుంటున్నారు. బిగ్ బాస్ షోలో టాస్క్ కు టాస్క్ కు మధ్య ఈ రకమైన వాణిజ్య ప్రచారాలు బాగానే జరుగుతున్నాయి. శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లోనూ ప్రెస్టేజ్ సంస్థ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు రెండు సార్లు బహుమతులను అందించింది. హౌస్ మేట్స్ ఆకలిని…
సెలబ్రిటీలపై నోరు పారేసుకోవడం, లేదా ఎలాగు వాళ్ళకు కన్పించము కదా అని సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేయడం, నెగెటివిటీని ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కొందరు. కానీ దానికి కూడా పరిమితి ఉంటుంది. అది దాటిందంటే మాత్రం సోషల్ మీడియా చాటున దాగి ఇలాంటి పనులు చేసేవారు కష్టాల బారిన పడక తప్పదు. తాజాగా అలాగే సోషల్ మీడియా ద్వారా టార్చర్ చేస్తున్న ఓ వ్యక్తిపై బిగ్ బాస్ బ్యూటీ ఫైర్ అయ్యింది. నీకేంట్రా నొప్పి…
బిగ్ బాస్ హౌస్ లో 8వ రోజు నామినేషన్స్ జరగడంతో… ఆ రాత్రి దాదాపు 12.45 వరకూ కంటెస్టెంట్స్ మెలుకువగానే ఉన్నారు. ఎవరు? ఎందుకు? ఎవరిని నామినేట్ చేశారనేది తెలుసుకునే ప్రయత్నం కొందరు చేశారు. రాత్రి బాగా పొద్దు పోవడంతో 9వ రోజు 9.45కు బిగ్ బాస్ సభ్యులను మేల్కొలిపాడు. అయితే ముందు రోజు నామినేషన్స్ సమయంలో జరిగిన గొడవల కారణంగా ఇటు కాజల్, అటు శ్వేత వర్మలకు కన్నీటితోనే తెల్లవారినట్టు అయ్యింది. మాటల మధ్యలో తాను…
బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయిన వ్యక్తి సరయు. బిగ్ బాస్ షో కు సంబంధించి గతంలో కంటే సీక్రెసీ మెయిన్ టైన్ చేస్తామని నిర్వాహకులు చెప్పినా… ఎలిమినేట్ అయిన వ్యక్తి ఇలా బయటకు రాగానే అలా వారిపేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ రకంగా నిన్న రాత్రి నుండి ఈ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేట్ అవుతోంది సరయు అనే ప్రచారం జరిగిపోయింది. దాన్ని బలపరుస్తూ సరయు బిగ్…
ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుని 5వ సీజన్ లోకి అడుగు పెట్టింది ఈ షో. ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా 2వ సీజన్ కు నాని హోస్ట్ గా మారాడు. ఆ తర్వాత మూడు, నాలుగు సీజన్స్ తో పాటు ప్రస్తుతం నడుస్తున్న 5వ సీజన్ కు కూడా నాగార్జుననే…
తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎదురుచూస్తున్నా బుల్లితెర షో బిగ్‌బాస్ 5 నేడు ప్రారంభమైంది. 19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్‌బాస్ హౌస్ లో సందడి మొదలైయింది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ స్టేజ్‌పై హోరెత్తించారు. కాగా, అందరు ఊహించిన కంటెస్టెంట్స్ లిస్టే బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. కొన్ని కొత్త పేర్లు కూడా వచ్చి చేరాయి. అధికారికంగా ప్రకటించిన బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే.. 1…
ఇటీవల కాలంలో తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటికి నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో 5వ సీజన్ కి రెడీ అయింది. పోటీదారుల ఎంపిక పూర్తయి క్వారంటైన్ లో ఉన్నారు. మూడో సారి నాగార్జున హోస్ట్ గా సెప్టెంబర్ నుంచి ఈ షో ప్రసారానికి సిద్ధం అవుతోంది. షణ్ముఖ్, రవి, వర్షిణి వంటి పేరున్న కళాకారులు ఇందులో పాలు పంచుకోబోతున్నట్లు పుకార్లుతో సోషల్ మీడియాలో సందడి సందడిగా ఉంది.…
తెలుగునాట ప్రాచుర్యం పొందిన రియాల్టీ గేమ్ షో ‘బిగ్ బాస్’ 5వ సీజన్ సెప్టెంబర్లో మొదలు కాబోతోంది. వరుసగా మూడోసారి కింగ్ నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. కరోనా మూడో వేవ్ రాబోతుందన్న వార్తల నేపథ్యంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సీజన్ ను ఆరంభించానికి సన్నాహాలు చేస్తున్నారు. గత సీజన్ లో పోటీదారులందరూ హైదరాబాద్లో స్టార్ హోటల్లో క్వారంటైన్ టైమ్ స్పెండ్ చేసి నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా…