దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రధారి రమ్యకృష్ణ డైలాగ్ గుర్తుంది కదా! ‘నా మాటే శాసనం’ అంటూ ఉంటుంది. ఇప్పుడు అదే మాటను కాస్తంత మార్చి ‘నియంత మాటే శాసనం’ అంటున్నాడు బిగ్ బాస్. సీజన్ 5 ముగియడానికి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉండటంతో, చివరి కెప్టెన్సీ టాస్క్ ను మొదలు పెట్టేశారు. దాని పేరే ‘నియంత మాటే శాసనం’. ఇందుకోసం గార్డెన్ ఏరియాలో ఓ భారీ సింహాసనం పెట్టారు. బజర్ మోగగానే…
బిగ్ బాస్ సీజన్ 5 కథ కంచికి చేరే సమయం ఆసన్నం కావడంతో హౌస్ మేట్స్ మధ్య వాదోపవాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో కెప్టెన్ తప్ప అంతా నామినేషన్స్ కు గురవుతామనే విషయం తెలిసి కూడా, ఎవరి వాదనలు వారు వినిపించే క్రమంలో గట్టిగా అరుచుకుంటూ, వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. సోమవారం నామినేషన్స్ సమయంలో సన్నీ, శ్రీరామచంద్ర మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మధ్యలో మానస్ వచ్చి వారిని…
బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగు పెట్టింది. హౌస్‌లోకి ప్రవేశించిన 19 మంది పోటీదారులలో 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎనిమిది మంది గేమ్‌లో మిగిలి ఉన్నారు. ఈ ఎనిమిది మంది హౌస్‌మేట్స్ ఫైనల్ టాప్ ఫైవ్‌లో ఉండేందుకు పోటీ పడుతున్నారు. కాగా 12వ వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిన్న రాత్రి జరగగా ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రికి ప్రసారం కానుంది. ప్రోమో ప్రకారం బిగ్ బాస్…
కింగ్ నాగార్జున రిలేషన్ షిప్ కౌన్సెలర్‌గా మారిపోయారు. అయితే ఆయన రిలేషన్ షిప్ కౌన్సెలర్ అయ్యింది సినిమా కోసం కాదు బిగ్ బాస్ కోసం. శనివారం రాత్రి జరిగిన ‘బిగ్ బాస్ 5’ ఎపిసోడ్ లో నాగార్జున రిలేషన్ షిప్ కౌన్సెలర్ లాగా వ్యవహరించారు. హౌస్ లో షణ్ముఖ్, సిరి ప్రవర్తనను నిలదీసిన నాగ్ వెళ్లిపోవాలంటే బయటకు వెళ్లొచ్చు అంటూ బిగ్ బాస్ హౌస్ గేట్లు ఓపెన్ చేయించారు. ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి హౌస్…
‘బిగ్ బాస్ తెలుగు 5’ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. వీక్షకులు తమ అభిమాన కంటెస్టెంట్స్ కు దూకుడుగా ఓటు వేస్తున్నారు. ప్రియాంక సింగ్, సిరి, షణ్ముఖ్, మానస్, కాజల్, సన్నీ, శ్రీరామ్ చంద్ర, అనీ మాస్టర్ 11వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్‌లో ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ వారం షో నుండి అనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. అనీకి అందరి కంటే అతి తక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె గత…
‘బిగ్ బాస్ 5’ 11వ వారం వీకెండ్ కు వచ్చేసింది. ఇటీవల కాస్త స్పీడ్ ను పుంజుకున్న ఈ షో ఆసక్తికరంగా మారింది. టాస్కులు, సన్నీ అగ్రెషన్, మానస్ సైలెన్స్, సిరి, షన్ను ఫ్రెండ్ షిప్ కాస్తా లవ్ షిప్ గా మారడం వంటి విషయాలు, వివాదాలతో వారాంతానికి చేరుకుంది. హౌస్ లో ఈ వారం రోజుల్లో జరిగిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఈరోజు వచ్చే ఎపిసోడ్ లో నాగార్జున ఎవరెవరికి ఎలా మొట్టికాయలు వేయబోతున్నారో చూడాలని…
‘బిగ్ బాస్ సీజన్ 5’ మంచి జోష్ లో సాగిపోతోంది. ప్రస్తుతం 11 వారం కొనసాగుతున్న షోలో కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతుంది. సిరి, యాని మాస్టర్, మానస్, ప్రియాంక కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్నట్లుగా తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తుంటే అర్థమవుతోంది. టాస్కుల సంగతి పక్కన పెడితే షో స్టార్టింగ్ నుంచి హౌజ్ లో నడుస్తున్న లవ్ ట్రాక్ ల విషయంపై బయట చర్చ ఎక్కువగా నడుస్తోంది. అయితే హౌజ్ లో ముందు నుంచీ మంచి స్నేహితులుగా కొనసాగుతున్న…
బిగ్ బాస్ సీజన్ 5లో ఎప్పుడు, ఎవరు, ఎవరితో మింగిల్ అవుతున్నారో తెలియకుండా ఉంది. కెప్టెన్సీ టాస్క్ ‘నీ ఇల్లు బంగారం కాను’లో పోటీ కంటే కూడా చర్చోపచర్చలు ఎక్కువగా జరిగాయి. గార్డెన్ ఏరియాలోని గోల్డ్ మైన్ నుండి బంగారు ముత్యాలు ఏరుకోవడం, వాటిని భద్రంగా దాచిపెట్టుకోవడం రెండూ కూడా కొంత ఇబ్బందినే కలిగిస్తున్నాయి. దాంతో ఎవరికి వారు అవకాశం చిక్కాలే కానీ దొంగలుగా మారిపోతున్నారు. Read Also : ‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న…
బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సన్నీ ఆవేశం అతన్ని ఇతర కంటెస్టెంట్స్ నుండి నిదానంగా దూరం చేస్తోంది. కొన్ని టాస్క్ లలో చక్కటి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సన్ని, కారణం ఏదైనా కానీ కొన్ని చోట్ల మాత్రం తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు. గత వారం ఈ విషయంలో నాగార్జున నుండి విమర్శలూ ఎదుర్కొన్నాడు. అయితే బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో సన్నీ మరోసారి తన సహనాన్ని కోల్పోయాడు. అతని పక్షాన నిలిచిన కాజల్ చెప్పిన మాటలనూ…
ఈ వారం ‘బిగ్ బాస్ 5’ కంటెస్టెంట్లకు కష్టమైన వారమని చెప్పొచ్చు. కెప్టెన్ గా ఉన్న ఒక్క రవి తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు. ఎనిమిది మంది సభ్యులు ఈ వారం నామినేషన్లలోకి రావడంతో డేంజర్ జోన్‌లో ఎవరెవరు ఉన్నారు? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నామినేషన్ల జాబితాలో సిరి, షణ్ముఖ్, అనీ మాస్టర్, కాజల్, శ్రీరామ చంద్ర, సన్నీ, మానస్, ప్రియాంక ఉన్నారు. Read Also : ‘జై భీమ్’ కాంట్రవర్సీపై…