బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” వేదికపై ఈరోజు ఘనంగా వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 4న దీపావళి కావడంతో కాస్త ముందుగానే అంటే ఈ వీకెండ్ ఆదివారం “బిగ్ బాస్ 5” వేదికపై దీపావళి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ప్రోమోను చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది. టీవీ పరిశ్రమలోని ప్రముఖ నటులతో పాటు, సినీ ప్రముఖులు కూడా షోలో పాల్గొన్నారుజరుపుకుంటారు. ఈ ప్రత్యేక దీపావళి ఎపిసోడ్‌లో వినోదం రెట్టింపు కావడంతో దీపావళి…
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” 50 రోజుల తరువాత ఊపందుకుంది. సన్నీ కోపం, మానస్ ఓదార్పు, యాని మాస్టర్ ఫైర్, మానస్, ప్రియా ట్రాక్ ఇలా హౌజ్ లో నవరసాలూ ఒలికిస్తున్నారు హౌస్ మేట్స్. రవి, లోబో, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. ఇక వీకెండ్ రావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తన్నారు. కానీ వారి ఆసక్తిని నీరు గార్చేస్తూ ఎప్పటిలాగే…
బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు శనివారం నాగార్జున క్లాస్ పీకడం కొన్ని వారాలుగా కామన్ అయిపోయింది. వరెస్ట్ పెర్ఫార్మర్ ఎంపికతో పాటు కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా జరుగుతున్న వాదోపవాదాలను కూల్ చేయడానికి, తప్పు చేసిన వారికి ఆ విషయాన్ని సూటిగా చెప్పడానికి నాగార్జున కాస్తంత ఎక్కువ సమయమే తీసుకుంటున్నాడు. శనివారం కూడా అదే జరిగింది. హౌస్ లోని ఒక్కో మెంబర్ ఫోటోనూ క్రష్ చేస్తూ, వారి ప్లస్ పాయింట్స్, మైనెస్ పాయింట్స్ చెబుతూ…
బిగ్ బాస్ సీజన్ 5లో తొలిసారి రెండు రోజుల పాటు సన్నీ పూర్తి స్థాయిలో సహనం కోల్పోయాడు. అభయ హస్తం టాస్క్ లో భాగంగా చివరిలో జరిగిన ‘వెంటాడు – వేటాడు’ ఆటలో సంచాలకుడు జెస్సీ నిస్సహాయత కారణంగా సన్నీ – మానస్ బలయ్యారు. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ను తనకు అనుగుణంగా మలుచుకుని జెస్సీ కొంత పక్షపాతం చూపించాడు. అయితే మానస్ ఒకానొక సమయంలో సంయమనం పాటించినా, సన్నీ మాత్రం ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు.…
“బిగ్ బాస్ 5” రానురానూ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే 50 ఎపిసోడ్ లను కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షోలో టాప్ 5కు ఎవరు వెళ్తారన్న టాక్ బాగా నడుస్తోంది. అయితే టాస్కులు, గొడవలతో ఎప్పటిలాగే రోజులు గడుస్తున్నాయి. కానీ హౌజ్ లో అమ్మాయిల సంఖ్య తగ్గడంతో గ్లామర్ కూడా బాగా తగ్గిపోయింది. ఏడూ వారాల్లో దాదాపు ఐదుగురు అమ్మాయిలే ఎలిమినేట్ కావడం దీనికి కారణం. ప్రస్తుతం హౌజ్ లో కాజల్, సిరి, అన్నే, ప్రియాంక నలుగురు…
జెస్సీ లో నాయకత్వ లక్షణాలు లేవని 53వ రోజు మరోసారి రుజువైంది. ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ లో పోటీ షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, మానస్, సన్నీ మధ్య జరిగింది. ‘వెంటాడు – వేటాడు’ పేరుతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు టాస్క్ ఇచ్చారు. రెండు సర్కిల్స్ లో ధర్మోకోల్ బాల్స్ ఉన్న బ్యాగ్స్ ను ధరించి పోటీదారులంతా ఒకరి వెనుక ఒకరు నడుస్తూ ఎదుటి వారి బ్యాగ్స్ లోంచి ధర్మో కోల్ బాల్స్ ను…
బిగ్ బాస్ గేమ్ షో లో ఈసారి లీకులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళంతా సోషల్ మీడియాలోనూ పాపులర్ పర్సన్స్ కావడంతో వారికి సంబంధించిన బృందాలు ప్రతి చిన్న అప్ డేట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వైరల్ చేస్తున్నాయి. దాంతో బిగ్ బాస్ చూసే వాళ్ళకంటే దాని గురించిన విశ్లేషణ చేసేవారు, దానికి సంబంధించిన లీక్స్ ను షేర్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇంతకూ విషయం ఏమంటే… ఈ…
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న 5వ సీజన్‌లో బిగ్ బాస్ తెలుగు టైటిల్‌ను గెలుచుకునే టాప్ 5 కంటెస్టెంట్స్ లో పాపులర్ సింగర్, నటుడు శ్రీరామ చంద్ర కూడా ఒకరు. శ్రీరామ్‌కు సోషల్ మీడియాలో, మొబైల్ ఓటింగ్ ద్వారా సపోర్ట్ ఇస్తున్న ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. ఇదిలా ఉంటే శ్రీరామ చంద్రకి కొంతమంది ప్రముఖులు కూడా తమ సపోర్ట్ ను ఇస్తున్నారు. ఇప్పటికే యంగ్ బ్యూటీ పాయల్…
“బిగ్‌బాస్ హౌస్”లో రానురానూ గొడవలు ఎక్కువవుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు వాటిని అక్కడిక్కడే పరిష్కరించుకోకుండా కొందరు అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో ఇంటి సభ్యులు గ్రూపులుగా ఏర్పడి ఒకరితో ఒకరికి సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ టాస్కులు వచ్చినప్పుడు మాత్రం కలిసే ఆడుతున్నారు. అయితే ఆ టాస్కులు కూడా ఇంటి సభ్యుల మధ్య గొడవ పెట్టడానికే అన్నట్టుగా ఉన్నాయి. తాజాగా కెప్టెన్సీ పదవి కోసం ఇచ్చిన టాస్క్ లో శ్రీరామ్, సన్నీ మధ్య విభేదాలు వచ్చాయి. Rea Also :…
బిగ్ బాస్ సీజన్ 5 52వ రోజు కెప్టెన్సీ పోటీదారుల తుది ఎంపిక జరిగిపోయింది. ముందు రోజు జరిగిన టాస్క్ లలో గెలిచి కెప్టెన్సీ పోటీకి షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ అర్హత సంపాదించారు. ఇక ఆ మర్నాడు జరిగిన టాస్క్ లలో యానీ, సన్నీ మానస్ తమ సత్తాను చాటారు. రెండో రోజు ‘అభయ హస్తం’ నాలుగో రౌండ్ లో ‘రంగు పడుద్ది’ అనే గేమ్ ను బిగ్ బాస్ నిర్వహించాడు. ఇందులో ప్రియాంక – యానీ…