బిగ్ బాస్ గేమ్ షో లో ఈసారి లీకులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళంతా సోషల్ మీడియాలోనూ పాపులర్ పర్సన్స్ కావడంతో వారికి సంబంధించిన బృందాలు ప్రతి చిన్న అప్ డేట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వైరల్ చేస్తున్నాయి. దాంతో బిగ్ బాస్ చూసే వాళ్ళకంటే దాని గురించిన విశ్లేషణ చేసేవారు, దానికి సంబంధించిన లీక్స్ ను షేర్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు.
ఇంతకూ విషయం ఏమంటే… ఈ రోజు బిగ్ హౌస్ కెప్టెన్సీ టాస్క్ లో షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, సన్నీ, మానస్, యానీ మాస్టర్ పోటీపడుతున్నారు. వీరిలో విజేత ఎవరు అనే ఉత్సుకతకు తెర దించుతూ, ‘షణ్ముఖ్ కెప్టెన్ గా ఎన్నికయ్యాడు’ అనే ప్రచారం బాగా జరుగుతోంది. రేషన్ మేనేజర్ గా యానీ మాస్టర్ సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది. గత రెండు మూడు వారాలుగా షణ్ముఖ్ డల్ మూడ్ లో ఉన్నాడు. జెస్సీని సేవ్ చేయడానికి వెళ్ళిన ప్రతిసారి తనకు, సిరికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని గమనించి, తమని హౌస్ మేట్స్ అంతా ఐసొలేట్ చేస్తున్నారని గ్రహించి షణ్ణు ‘ప్లాన్ బి’ని అమలు చేయడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా జెస్సీతో వ్యూహాత్మక దూరం పాటించడంతో పాటు కాజల్, మానస్ లను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఒకవేళ సిరి, జెస్సీకి ఎప్పుడైనా ఫేవర్ గా మాట్లాడినా, ఆమెనూ కంట్రోల్ చేస్తూ, సెంటిమెంటల్ గా తనవైపు తిప్పుకుంటున్నాడు. దాంతో షణ్ముఖ్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో విజయం సాధించాడని తెలుస్తోంది. మరి కెప్టెన్ కావాలని ఎంతో కాలంగా తపిస్తున్న షణ్ణు ఆ హోదాలో ఏ మేరకు అందరినీ మెప్పిస్తాడో చూడాలి!