రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్ లోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (State Council for Education Research and Training) కార్యాలయం లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విద్యా పరిశోధన, శిక్షణ లో సంస్కరణలు తేవాలన్నారు. విద్యా శిక్షణ, పరిశోధన సంస్థ ప్రమాణాలు ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచేలా మంచి శిక్షణ, పరిశోధన కేంద్రంగా…
15,644 పోలీసు కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి ఎంపిక ప్రక్రియను నాలుగు వారాల్లోగా ప్రారంభించాలని, త్వరితగతిన ఎంపికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం ఆదేశించింది. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి మరియు జస్టిస్ ఎన్. రాజేశ్వర్ రావుతో కూడిన ధర్మాసనం, ‘తప్పు ప్రశ్నల’ వివాదాన్ని తొలగించాలని కోరిన స్వతంత్ర నిపుణుల సంఘానికి మళ్లీ సూచించింది. స్వతంత్ర నిపుణుల సంఘం నుంచి రెండో అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే ఎంపిక…
అధికారం పోయిందనే అక్కసు.. బీఆర్‌ఎస్‌లో కనిపిస్తుందన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గడిలా పాలన కాదు..గల్లీ బిడ్డల పాలన కావాలని ప్రజలు కోరుకున్నారని, ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించడానికే 35 రోజులు తీసుకుంది బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. ప్రజలు ధైర్యంగా ఉన్నారని, ధైర్యం కోల్పోయింది బీఆర్‌ఎస్ నేతలేనని ఆమె విమర్శించారు. ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబరు 7న అని, 9వ తేదీనే రెండు పథకాలు అమలు చేశామన్నారు మంత్రి సీతక్క. ఒకే సారి రుణమాఫీ అన్నారు..…
పార్లమెంట్ లో ఒక సీటు ఇవ్వండి.. కాంగ్రెస్ ని కోరిన సీపీఐ పార్లమెంట్ లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ ని అడుగుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. కార్మిక సంఘాల్లో బలంగా ఉన్నామన్నారు. కానీ బలానికి అనుకూలంగా ఓటు రావడం లేదని తెలిపారు. పార్టీని పెంచుకోవాలని నిర్ణయించామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పని చేస్తామన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి కాంగ్రెస్ అని తెలిపారు. పార్లమెంట్ లో ఒక…
తెలంగాణ రాజకీయ పరిణామాల్లో ముఖ్యమైన పరిణామంగా , ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో ఏర్పడిన ఖాళీల కారణంగా రెండు ఎమ్మెల్సీ పదవులు పోటీకి తెరలేవడంతో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జనవరి 11న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో వ్యూహాత్మక పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడమే…
రజక, నాయీ బ్రాహ్మణులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రజక, నాయీ బ్రాహ్మణులకు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు, హెయిర్ కటింగ్ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. వాషర్ మెన్ లో లబ్ధిదారుల సంఖ్య 76,060 కి 78.55 కోట్లు, నాయి బ్రహ్మణ…
నేటి నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఓడిపోతుందని అనుకోలేదని గ్రామాల్లో చర్చ జరుగుతుందన్నారు. కొన్ని పథకాల విషయంలో చిన్న చిన్న లోటు పాట్లు ఉన్నాయని, పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదని నేతలు ఈ సమావేశం లో చెప్పారన్నారు కేటీఆర్. కొన్ని ఇబ్బందులు వచ్చాయి అవి కూడా మేము గుర్తించామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 ఉన్నాయన్నారు. అవన్నీ బుక్ లెట్ లో…
మహిళా శక్తికి కృతజ్ఞుడను.. కేరళలోని త్రిసూర్‌లో ప్రధాని మోడీ ప్రసంగం ఈ ఏడాది చివర్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారానికి మెగా పుష్‌గా భావించే ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత పర్యటనలో 2వ రోజు త్రిసూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. బుధవారం కేరళలోని త్రిసూర్‌లో జరిగిన మహిళా సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి…
ఊహించిన విధంగానే తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో దఫా భారీ ఐఏఎస్‌ల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసింది.తాజా ఉత్తర్వుల్లో 26 మంది టాప్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు.శాసనసభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం స్థిరపడి, ఏకకాలంలో 2024లో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నందున ఈ బదిలీలు కీలకమైనవి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను బదిలీ చేయడంతోపాటు రాష్ట్రంలోని 26 మంది ఐఏఎస్ అధికారులను…