అధికారం పోయిందనే అక్కసు.. బీఆర్‌ఎస్‌లో కనిపిస్తుందన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గడిలా పాలన కాదు..గల్లీ బిడ్డల పాలన కావాలని ప్రజలు కోరుకున్నారని, ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించడానికే 35 రోజులు తీసుకుంది బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. ప్రజలు ధైర్యంగా ఉన్నారని, ధైర్యం కోల్పోయింది బీఆర్‌ఎస్ నేతలేనని ఆమె విమర్శించారు. ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబరు 7న అని, 9వ తేదీనే రెండు పథకాలు అమలు చేశామన్నారు మంత్రి సీతక్క. ఒకే సారి రుణమాఫీ అన్నారు.. ఐదేళ్లు చేశారు కేసీఆర్ అని, పదేళ్లు దోచుకున్న 420 లు మీరు అని ప్రజలు గుర్తించే ఓడగొట్టారన్నారు. తమది గడీల పాలన కాదని… గల్లీ బిడ్డల పాలన అనీ అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందని… దీనిని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోవడం లేదన్నారు.
ఆటో డ్రైవర్ల ను రెచ్చగొట్టి ఉద్యమం అంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు అని, మహిళలకు ఉచిత బస్సు వసతి ఇవ్వద్దు అంటారా..? అని ఆమె ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఉచిత బస్సు మీద అక్కసు వెళ్లగక్కుతున్నారని, ఫార్మ్ హౌస్ లకు రైతు బంధు తిన్నారన్నారు. బీఆర్ఎస్ 420 పార్టీ అని, ధర్నా చౌక్ లేకుండా చేసిన 420 మీరు అని ఆమె మండిపడ్డారు. బంగారు తెలంగాణ అని భ్రమలు కల్పించారని, బంగారు తెలంగాణ అని ఆరు లక్షల అప్పులు చేశారన్నారు. అప్పులు చేశారు అంటే నువ్వు అవమానపడు అని, నువ్వు చేసిన అప్పులకు ప్రజలు ఎందుకు అవమానపడతారన్నారు. బీఆర్ఎస్ ఫ్యూడల్ పార్టీ అని ఆరోపించారు. అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారన్నారు.