హీరోయిన్ పూనమ్ కౌర్ షేర్ చేసిన ఓ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించగా, త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు “భీమ్లా నాయక్” ఫీవర్ పట్టుకుంది. థియేటర్లలో అభిమానులు చేస్తున్న రచ్చకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సినిమా ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. సినిమాలో పవన్, రానా నటనతో పాటు త్రివిక్రమ్ డైలాగులు, తమన్ మ్యూజిక్ సినిమాలో ప్రధాన హైలెట్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ ‘భీమ్లా నాయక్’ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.
Read Also : Bheemla Nayak : ఆర్జీవీ రివ్యూ… ఏమన్నాడంటే?
“బావ సినిమాకి వచ్చాను అక్కా” అని ఎవరో ఆమెతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ లను పంచుకుంది. అందులో హానెస్ట్ రివ్యూ ఇవ్వమని పూనమ్ అడుగుతోంది. దానికి ఆమె కూడా ఓకే చెప్పింది.