సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్ మార్చ్ పాదయాత్ర హనుమకొండ జిల్లాలో కొనసాగుతోంది. అయితే ఈ సందర్భంగా కర్నార్ మీటింగ్‌లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు మనకు కావాలన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేనన్నారు. సింగరేణి తెలంగాణ సంపద , ఆలోచన ప్రవేట్ పరం చేస్తే కోట్ల రూపాయలు దండుకోవచ్చు అని కేసీఆర్ ఆలోచన అని ఆయన విమర్శించారు. సింగరేణి నీ ప్రైవేట్ పరం చేస్తే శ్రమ దోపిడీ తప్ప ఉద్యోగులకు ఒరిగేది ఏమీ లేదన్నారు.
Also Read : RCB vs KKR: డేంజర్ జోన్‌లో ఆర్సీబీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
సోనియా గాంధీ నాయకత్వంలో గ్రామీణ ఉపాధి పథకం చేపట్టడం జరిగిందన్నారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ తయారీ, రైల్వే రిపేర్ ఫ్యాక్టరీ వచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీల వల్ల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ , బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాలేదన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గానికి కూడా కాలేశ్వరం నీళ్లు రాలేదన్నారు. లక్ష 25 వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఎటు పోతున్నాయని, కాలేశ్వరం ప్రాజెక్టు పెద్ద వృధా అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : West Bengal: భార్యతో గొడవలు.. తుపాకీతో స్కూల్‌లో పిల్లలను బందీచేయాలనే ప్లాన్..