మంత్రి కేటీఆర్ చెబుతున్న తెలంగాణ మోడల్ అంటే ఇదేనా అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మడం, ఔటర్ రింగ్ రోడ్డును లీజ్ కు ఇవ్వడం.. 5 లక్షల కోట్ల చోప్పున అప్పుల చేయడం, మద్యం అమ్మకాలు రూ. 36 వేల కోట్లకు పెంచడం ఇదేనా మీరు చెప్పిన తెలంగాణ మోడల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Minister RK Roja: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. బాబుపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ చేయకపోతే.. 30 ఏళ్లకు లీజుకు ఇచ్చిన అవుటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు.. హైదరాబాద్ చూట్టు స్థాపించిన పరిశ్రమలు, తెలంగాణలో పారుతున్న నీళ్లు, ఎస్సారెస్పీ, కడెం, దేవాదుల ఎత్తిపోతల పథకం, శ్రీపాద ఎల్లంపల్లి, జూరాల, నెట్టెంపాడు, కోయల్ సాగర్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఫైర్ అయ్యారు. ఈ పదేళ్లలో కేసీఆర్ సర్కార్ చేసింది శూన్యం మాత్రమే అంటూ మండిపడ్డారు.
Also Read : Wrestlers Protest: రెజ్లర్లు వీధుల్లోకి రావడం దారుణం.. వారికి న్యాయం జరగాలి
కాంగ్రెస్ పార్టీకి తాము చేసే పాదయాత్రలకి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో ఏ గ్రామం వెళ్లినా అప్పటి కాంగ్రెస్ పాలను గుర్తు చేస్తుకుంటున్నారు అని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ అమలు కాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని భట్టి అన్నారు.
Also Read : TS High Court : తెలంగాణ హైకోర్టుకు సమ్మర్ హాలిడేస్
రైతులు వృద్ధులు. మహిళలు విద్యార్థులు ఇలా అందరూ తమ సమస్యలు చెప్పుకుంటున్నారు అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల్లో ఎమ్మెల్యేల మీద వ్యక్తిరేకత పెరిగింది.. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ భట్టి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు జారీ పోకుండా 100 సీట్లు గెలుస్తాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు కేసీఆర్ మాటలను నమ్మడం లేదు అని భట్టి విక్రమార్క అన్నారు.