Bhatti Vikramarka : కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం జనగణనను వెంటనే మొదలు పెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హన్మకొండ జిల్లా కేయు ముందు ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ ఎంపీ రాజయ్య డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌తో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లౌకిక వాదానికి భిన్నంగా అమిత్ షా మాట్లాడిన దానికి ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదుపలేదని ఆయన మండిపడ్డారు. తద్వారా రాష్ట్రం నష్టపోతుందని, బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న అండర్ స్టాండ్ ఏంటీ? అని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం బీఆర్ఎస్ మీ ఇద్దరికి అండర్ స్టాండ్ ఏంటి బీజేపీతో అని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భారత రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించిందని, మీరు రిజర్వేషన్లు కల్పించేది ఏమిటని ఆయన మండిపడ్డారు. జనాభా దామాషా ప్రకారం రావాల్సిన రిజర్వేషన్ల గురించి రాహుల్ గాంధీ కొట్లాడుతున్నాడని, తెలంగాణలో అత్యధికంగా బహుజనులు 54 శాతం ఉన్నారన్నారు భట్టి విక్రమార్క. అమిత్ షా ఇక్కడి డిమాండ్ కు అనుగుణంగా సమాధానం చెప్పకుండా మరేదో చెప్పిపోతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ‘కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం జనగణనను వెంటనే మొదలు పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం బీసీ సబ్ ప్లాన్ ను తీసుకురావాలి.
Also Read : Peddi Sudarshan Reddy : రూ. 2.కోట్లతో కార్యకర్తలకు సంక్షేమ నిధి
Also Read
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
రెండు లక్షల 90 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తావ్.. 54 శాతం ఉన్న బీసీలకు ఐదు శాతం బడ్జెట్ ఇస్తారా?. బీసీలకు 50 శాతం బడ్జెట్ కేటాయించాలి. కొత్త రాష్ట్రమని రెండోసారి కేసిఆర్ కు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. నిధులు నియామకాలు లేకుండా దోపిడీ చేశారు. అంతరాలు లేని సమాజం ఎదగాలి. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బిజేపి 9ఏళ్ళ 18 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో బండి సంజయ్ సమాధానం చెప్పాలి. దేశప్రజల సొమ్మంతా దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ అంటే రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే గత్యంతరం లేని పరిస్థితిలో కాంగ్రెస్ గెలిపించుకోవాలి. ప్రభుత్వాలు చెప్పిన మాటకు చేతల్లో లేదు. రాష్ట్రం ఏర్పాటు సైద్ధాంతిక బలం ఇచ్చిన ప్రాతం వరంగల్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్ అభివృద్ధి చెందుతుందని భావించాం. స్మార్ట్ సిటీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ని కుర్చి వేసుకుని పూర్తి చేస్తామన్నారు. పునర్విభజనలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామి అమలుకు నోచుకోలేదు.
సమస్యల పరిష్కారానికి తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్‌కే సాధ్యం.. ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం’ అని భట్టి విక్రమార్క అన్నారు.
Also Read : Tollywood: ఈ వీకెండ్ థియేటర్ లో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే!
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!