పేదవాడికి ఇళ్ళు లేకుండా ఇళ్ల కోసం రోడ్డు మీద పిల్లలు పెట్టుకొని ఏడుస్తుంటే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తు కనపడిన ప్రతి వారిని ఇళ్ళు ఒక ఇప్పించండి అని వేడుకుంటున్నారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. వెలుగులతో నిండాలని కాదా తెలంగాణ తెచ్చుకుందని, మధ్య యుగాల నాటి రాజభోగలు అనుభవిస్తూ, ప్రజల హాహాకారాలు అన్నం కోసం అల్లడిపోతుంటే రాజరికాపు భవనాలు కట్టుకొని పంచభక్షపరమన్నాలు తింటున్నారన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలందిరి ప్రయోజనాలు నిండిన తర్వాత నువ్వు ఎలాంటి బిల్డింగ్లు కట్టుకున్న పరవాలేదు.
Also Read : Mallemala: ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్యకు కారణం అదేనా..?
నేడు ప్రజలందరూ బాధ పడుతున్నారు ఇళ్ళు లేక, ఇళ్ల స్థలాల కోసం, ఉద్యోగులు లేక ఇబ్బంది పడుతున్నారు.. తెలంగాణ లో తలఎత్తుకొని ఆత్మ గౌరవం బత్రక వల్సింది ప్రజలు. తెలంగాణ సమాజంలో బ్రతకడానికి కావాల్సిన కామన్ ఫెసిలిటీస్ అందించు. మౌఖిక వసతులు ఏర్పాటు చేసి నువ్వు ఎలాంటి విలాసాల కార్యాలయాలనైనా కట్టుకో.. దేశం అంటే మట్టి కాదు..దేశం అంటే ప్రజలని, ప్రజలు ఇళ్లులేక ఇబ్బందులు పడుతుంటే పెద్ద భవనాలు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఉపాధి, ఉద్యోగాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు. తెలంగాణలో పాలన గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఆదాయం వచ్చే శాఖలపై దృష్టి పెట్టి మిగిలిన వాటిని వదిలేశారని మండిపడ్డారు.
Also Read : Salman Khan: ఏయ్.. నాకు పెళ్లి వద్దు.. కానీ, పిల్లలు మాత్రం కావాలి.. అది కూడా అలా