Harish Rao vs Bhatti Vikramarka: ఇంత పచ్చిగా ఎలా మాట్లాడతారు.. నేను ఒప్పుకున్నానా..? అని హరీష్ రావు పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై హరీష్ రావు మాట్లాడారు. మమ్మల్ని కూడా చూపించండి.. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఇదే చెప్తున్నారు అన్నారు. ఆయన వారసులు అని చెప్పుకునే మీరు.. మమల్ని కూడా చూపించండి అంటూ మాట్లాడారు. పదేళ్లు రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తెచ్చారని హరీష్ రావు అన్నారు. మేము నెలనెలా వారికి జీతాలు ఇచ్చే పని మొదలుపెట్టాం. రైతుల్ని హైదరాబాదు నగరాన్ని మహిళలను దృష్టిలో పెట్టుకొని ఆదర్శవంతమైన బడ్జెట్ ని ప్రవేశపెట్టామన్నారు. మా బడ్జెట్ చూసి హరీష్ రావుకి కంటగింపుగా ఉందన్నారు. ప్రతిపక్ష నేత బడ్జెట్ కి వచ్చారు. ఇవాళ సభకు రాలేదని తెలిపారు. వీళ్ళు వచ్చి గుడ్డ కాల్చి మీద వేస్తే ఎట్లా అంటూ హరీష్ రావు అన్నారు.
Read also: Andhra Pradesh: సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌కి మహిళ విజ్ఞప్తి.. మీరే దుక్కు.. లేకుంటే..!
భట్టి కూడా ఒప్పుకున్నారని హరీష్ రావు మాటలకు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇంత పచ్చిగా ఎలా మాట్లాడతారు.. నేను ఒప్పుకున్నానా..? అని హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. నేను చెప్పింది వేరైతే హరీష్ రావు చెప్పే మాటలు తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు బీఆర్‌ఎస్ పాలన ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో కూడా అలానే భ్రమలు కల్పిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేత ఇవ్వాళ సభకు వస్తారు అనుకున్నామని తెలిపారు. బడ్జెట్‌పై ఎల్‌ఓపీ మాట్లాడుతారు అనుకున్నామని తెలిపారు. ఎక్సైజ్ టెండర్లు ముందే ఎందుకు పిలిచారు? అని భట్టి ప్రశ్నించారు. టానిక్ లాంటి వారితో కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళనివ్వమన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. మేం అధికారంలోకి వచ్చాకు నెలనెలా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పని మొదలు పెట్టామని తెలిపారు. సర్కార్ సొమ్ము ప్రజలకు చేరేలా చేశామని తెలిపారు.
Donald Trump: నాపై కాల్పులు జరిపిన చోటే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా..