Telangana Budget 2024: త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ.. వరి సన్నాలకు రూ.500 బోనస్: డిప్యూటీ సీఎం
- అసెంబ్లీలో తెలంగాణ వార్షిక బడ్జెట్
- త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తాం
- వరి సన్నాలకు రూ.500 బోనస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Bhatti Vikramarka Said Loan Waiver will be completed soon in Telangana: 2024-25 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు.
‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అభివృద్ధిని ఆపలేదు. డిసెంబర్ నుంచి పథకాల కోసం రూ.34,579 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నాం. గతంలో పేపర్ లీకులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Also Read: Pranitha Subhash Pregnancy: రౌండ్ 2.. రెండేళ్లకే! తల్లి కాబోతున్న హీరోయిన్ ప్రణీత
‘రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రుణమాఫీకి రూ.31 వేల కోట్లు సమీకరిస్తున్నాం. త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం. లక్ష వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతులకు రుణమాఫీ చేశాం. రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ అవుతుంది. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలన్నది మా సంకల్పం. త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేల అందిస్తాం. రైతులు పండించే వరి సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తాం. ప్రధాని ఫసల్ బీమా యోజనలో చేరబోతున్నాం. మొత్తం వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అని భట్టి చెప్పారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!