Mallu Bhatti Vikramarka: లీడ్ బ్యాంకులు లోన్ల విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు..
- రైతుల ఖాతాల వేస్తున్న డబ్బులు రుణమాఫీ కోసమే వాడాలి..
- రుణమాఫీ తో రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి..
- ఆగస్టు దాటాక ముందే 2 లక్షల మాఫీ-11 లక్షల రైతులకు ఇవాళ మాఫీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: లోన్లు ఇచ్చే విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు.. లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతు రుణమాఫీ పై బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసే రైతు రుణమాఫీ నిధులను వాటికే వినియోగించాలి.. ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లో జమ చేయవద్దు.. రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఆగస్టు నెల దాటకముందే 31 వేల కోట్లు. రైతు రుణమాఫీ కింద విడుదల చేస్తామన్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు 11 లక్షల పైబడి రైతులకు 6000 కోట్ల పైబడి నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ నెలలోనే రెండోదఫా లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతుల రుణాలకు నిధులు విడుదల చేస్తామని అన్నారు. ఆ తర్వాత 2 లక్షల వరకు రుణమాఫీ నిధులను విడుదల చేస్తామన్నారు.
Read also: Shamshabad: ముందే చూసుకోరా.. లోపమంటే ఎలా..? ఎయిర్‌పోర్టు లో ప్రయాణికుల ఆందోళన..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
రెండు లక్షల పైన రుణం ఉన్న రైతుల తో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకొని.. ప్రభుత్వం మంజూరు చేసే రెండు లక్షలు కలుపుకొని మొత్తంగా ఏ రైతు రుణం బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా..31 వేల కోట్లు ఈ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చే ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా నేను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డు పై సంతకం చేసి ప్రచారంలోకి వెళ్ళామన్నారు. ఇచ్చిన మాట మేరకు కట్టుబడి ఉన్నాం తూచా తప్పకుండా రైతు రుణమాఫీని అమలు చేసి చూపిస్తున్నామని తెలిపారు. 40 లక్షల బ్యాంకు అకౌంట్లో ద్వారా 31 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని వెల్లడించారు. భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అన్నరు.
Read also: KamalHaasan : ఒకటి థియేటర్లో ఉండగానే మరోటి ముగించిన కమల్ హాసన్
కార్పొరేట్ బ్యాంకింగ్ సెక్టర్ లోను ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రికవరీ కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహం వుండాలన్నారు. ఈరోజు రైతులు ఎలాగా పండుగ చేసుకుంటున్నారు బ్యాంకర్లు కూడా అదే విధంగా పండుగ చేసుకోవాలన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకు రాబోతుందన్నారు. ఈ రాష్ట్ర జిఎస్ జిడిపి లో 16.5% వ్యవసాయ రంగం నుంచి వస్తుంది.. రాష్ట్రంలో 45% పైబడి ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు. రైతు రుణమాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకొని .. భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. లోన్లు ఇచ్చే విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు.. లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలని తెలిపారు. రైతు రుణమాఫీ నేపథ్యంలో బ్యాంకుల వద్ద అధికారులు ఉత్సవాలు జరుపుకోండి.. విస్తృతంగా ప్రచారం చేయండి అని డిప్యూటీ సీఎం సూచించారు.
NEET 2024 : నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ అదుపులో ముగ్గురు ఎయిమ్స్ డాక్టర్లు
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!