మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదివారం పరిశీలించారు.
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం భారత ఎన్నికల కమిషన్కు 40 మంది ప్రముఖ నేతల పేర్లను పంపారు. ఈ జాబితాలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత పీ. విశ్వనాథ్,…
Bhatti Vikramarka : హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజ్యసభలో బలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. “తెలంగాణ వచ్చాక పదేళ్లు ఒక కుటుంబం కోసమే పరిపాలన సాగింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యం…
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఈరోజు రూ.400 కోట్లు చెల్లిస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి సింగరేణి ప్రస్థానం ప్రారంభమైందని, ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణికే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భట్టి చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. ‘తొలిసారి సైంటిఫిక్గా రాష్ట్రంలో కులగణన…
Bhatti Vikramarka : బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న వేళ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైకోర్టు తీర్పుపై స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందిన తర్వాత పూర్తి అవగాహన చేసుకుని తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “హైకోర్టు 2025 సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు జరపాలని స్పష్టంగా చెప్పింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మేము గట్టి ప్రయత్నం చేశాం. కానీ, 2018లో బీఆర్ఎస్…
బీసీ రిజర్వేషన్లను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుంది అనే నమ్మకం మాకు ఉందన్నారు.
BC Reservations: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పాస్ అయ్యాక, ఉత్తర్వులు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్రెడ్డి సెప్టెంబరు 29న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి…
Gaddam Venkata swami: చిన్ననాటి నుంచి మొదలుకొని సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం తపిస్తూ జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడు జి. వెంకటస్వామి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. గడ్డం వెంకటస్వామి 96వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. Hit…