తాజా భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించారు.
ఢిల్లీలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల రాష్ట్రాలకు కలిగే ఆదాయ లోటును కేంద్రం భర్తీ చేయాలని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఢిల్లీ లో జరిగిన సమావేశంలో జీఎస్టీ రేషనలైజేషన్ (GST Rationalisation) అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ఎనిమిది రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు భారీ రెవెన్యూ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ క్రమంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, కీలక నిర్ణయాల కోసం కసరత్తు ప్రారంభించింది.
Bhatti Vikramarka Pays Tribute to Suravaram Sudhakar Reddy: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళి అర్పించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని మఖ్దూం భవన్కు వెళ్లిన భట్టి.. సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలను డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు. మనం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయాం అని అన్నారు. చిన్న…
ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపునకు స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఓట్ల చోరీ వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన ప్రత్యేక లోగోను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.
బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ వాళ్లను చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని విమర్శించారు. మెకానికల్ లైఫ్ కాదు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మానవ సంబంధాలే ఉండాలని తాము చూస్తున్నామన్నారు. ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చని పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధులతో 25 ఎకరాల్లో యంగ్…
Bhatti Vikramarka : తెలంగాణ గౌరవాన్ని దేశ స్థాయిలో నిలబెట్టేందుకు యువత కృషి చేయాలని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్రానికి బలమైన మానవ వనరులు (Human Resource) అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సివిల్స్ – 2025 మెయిన్స్ కు ఎంపికైన 178 మంది అభ్యర్థులకు రూ.1…
Komatireddy Rajagopal Reddy Tweet: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. సంచలన వ్యాఖ్యలు, ట్వీట్స్ చేస్తూ సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అయన ఖండించారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే మరో ట్వీట్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని, ఇది ముమ్మాటికీ వాస్తవమని పేర్కొన్నారు. అసలు వాస్తవాన్ని ప్రజలకు వివరించిన…
ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని, సమాజానికి అందించే ఓ బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మానవ వనరులు అత్యంత బలమైన పెట్టుబడి అని, మానవ వనరులకు మంచి తర్ఫీదు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. గతేడాది అభయ హస్తం పొందిన వారిలో 10 మంది సెలెక్ట్ అయ్యారని, 178 మందిలో గత ఏడాది కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలన్నారు. సమాజానికి నిబద్ధతతో చేసిన సేవ ప్రజల్లో…