CM Revanth Reddy : తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ పై సీఎం రేవంత్ రివ్యూ
- తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష
- డిసెంబర్ 8–9 గ్లోబల్ సమ్మిట్‌లో అధికారిక ఆవిష్కరణకు సిద్ధం
- రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మూడు ట్రిలియన్ డాలర్ల విజన్
- పారిశ్రామిక, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాలపై లోతైన చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే “తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్”పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంట్ తయారీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌పై లోతైన చర్చ జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ విజన్ డాక్యుమెంట్ పాలసీని డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ సమ్మిట్‌లోనే ‘తెలంగాణ విజన్ 2047’ పాలసీని ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ సమ్మిట్‌లో భాగంగా, మొదటి రోజు (డిసెంబర్ 8) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని ప్రెజెంట్ చేయడంతో పాటు, అన్ని వర్గాలకు, రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించి, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వారి విలువైన సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.
Also Read
ఇక రెండవ రోజు (డిసెంబర్ 9) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న శుభసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విజన్ డాక్యుమెంట్ను రాష్ట్ర ప్రజలకు ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యం తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ స్థాయికి చేర్చడం. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ ఏ రంగాలను (పారిశ్రామిక, రియల్ ఎస్టేట్, ఫార్మా వంటివి) ప్రోత్సహించాలి, కొత్త విధానాలను ఎలా అమలు చేయాలి అనే అంశాలపై ముఖ్యమంత్రి ఈ సమీక్షలో లోతుగా చర్చించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, విజన్ డాక్యుమెంట్ అంశాలను క్రోడీకరించారు. ఈ రోజు మంత్రులతో జరిగిన సుదీర్ఘ సమీక్ష ముగిసిన అనంతరం, విజన్ 2047 డాక్యుమెంట్‌కు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో పంచుకునే అవకాశం ఉందని సమాచారం.
Virat Kohli సంచలనం.. సెంచరీతో సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు బద్దలు!
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!