Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎలాంటి స్పష్టమైన విధానం లేకుండా, కేబినెట్ అనుమతి కూడా లేకుండా కొందరికే ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ అనుమతులు ఇచ్చారని, ఆ వివరాలన్నింటిని త్వరలో ప్రజల ముందుంచుతామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పూర్తి పారదర్శకతతో కొత్త ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. పరిశ్రమలను ORR వెలుపలికి తరలించడం, హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడం, ప్రజలపై అదనపు పన్ను భారాన్ని పెట్టకుండానే ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూర్చడం ఈ కొత్త పాలసీ ప్రధాన లక్ష్యాలు అని వివరించారు. 50 శాతం SOR రేటుతో అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఈ పాలసీ రూపొందించామని స్పష్టం చేశారు.
Pakistani Couple: భారత సరిహద్దు దాటిన పాకిస్తానీ ప్రేమ జంట..
నాచారం, మౌలాలి, కూకట్పల్లి, బాలానగర్, ఉప్పల్, జీడిమెట్ల వంటి ప్రాంతాలు ఒకప్పుడు నగరానికి వెలుపల ఉండేవని, పరిశ్రమల అభివృద్ధికి అప్పటి ప్రభుత్వాలు అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశాయని ఆయన గుర్తుచేశారు. కానీ నగరం విస్తరించడంతో ఇప్పుడు ఇవన్నీ నగర మధ్యలోకి వచ్చాయనే చెప్పారు. దీంతో ఈ ప్రాంతాలు రెడ్ మరియు ఆరెంజ్ జోన్లుగా మారాయని, కోర్టులు కూడా పరిశ్రమలను తరలించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశాయని తెలిపారు. ఎవరినీ బలవంతంగా బయటకు పంపే ఉద్దేశ్యం లేనందున, పరిశ్రమలు స్వచ్ఛందంగా కన్వర్షన్ చేసుకునే అవకాశమే ఈ పాలసీ ఉద్దేశమని భట్టి విక్రమార్క అన్నారు.
ప్రస్తుతం ఈ పార్కుల చుట్టూ లక్షలాది ఇళ్లు నిర్మాణం అయ్యాయని, ఇక్కడే పరిశ్రమలు కొనసాగితే ఢిల్లీలా హైదరాబాద్‌లో కూడా పాఠశాలలు, కార్యాలయాలకు కాలుష్యం కారణంగా సెలవులు ప్రకటించే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకూడదనే సంకల్పంతోనే, పారదర్శకంగా మరియు సమగ్రంగా ఈ కొత్త పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించి, పేదల కోసం సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు.
Rohit Sharma: నయా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. T20 ప్రపంచ కప్‌లో సరి కొత్త ప్రయాణం !